Happy Birthday Pawan Kalyan: పవర్‌స్టార్‌కు సెలబ్రిటీల విషెస్‌.. వైరల్ అవుతోన్న బండ్ల గణేశ్‌ ట్వీట్!

Happy Birthday Pawan Kalyan, Producer Bandla Ganesh Tweet about Pawan Kalyan Goes Viral. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ చేసిన ట్వీట్ మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 2, 2022, 12:47 PM IST
  • నేడు పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు
  • పవర్‌స్టార్‌కు సెలబ్రిటీల విషెస్‌
  • వైరల్ అవుతోన్న బండ్ల గణేశ్‌ ట్వీట్
Happy Birthday Pawan Kalyan: పవర్‌స్టార్‌కు సెలబ్రిటీల విషెస్‌.. వైరల్ అవుతోన్న బండ్ల గణేశ్‌ ట్వీట్!

Happy Birthday Pawan Kalyan, Bandla Ganesh Tweet about Pawan Kalyan Goes Viral: నేడు 'పవర్‌ స్టార్‌', జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు. దాంతో సోషల్ మీడియా మొత్తం పవన్ మేనియాతో ఊగిపోతోంది. ఫాన్స్, ప్రముఖులు, సినీ సెలెబ్రిటీలు, నటినటీమణులు పవన్‌కు బర్త్ డే విషెష్ తెలుపుతున్నారు. తమ్ముడి పుట్టిన రోజుని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి ఓ ట్వీట్ చేశారు. కల్యాణ్‌ బాబు ఆశలన్నీ నెరవేరాలని చిరు కోరుకున్నారు. 

పుట్టిన రోజు సందర్భంగా తమ్ముడు పవన్‌ కల్యాణ్‌కు అన్నయ్య చిరంజీవి ఆశీర్వాదం అందించారు. 'తన ఆశ, ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయతీ, చిత్తశుద్ధితో శ్రమించే పవన్ కల్యాణ్.. కలలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా. కల్యాణ్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు' అని చిరంజీవి ట్వీట్ చేశారు. 

'నా గురువు, ధైర్యం పవన్‌ కల్యాణ్‌ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు. పవర్ స్టార్ ఆయురారోగ్యాలతో ప్రతి రంగంలోనూ విజయాన్ని అందుకోవాలని ప్రార్థిస్తున్నా' అంటూ సుప్రీమ్ హీరో సాయిధరమ్‌ తేజ్‌ పేర్కొన్నారు. 

'మంచితనానికి మారుపేరు, మంచి మనసుకి నిర్వచనం, అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తిత్వం కలబోతే పవర్ స్టార్‌ పవన్ కల్యాణ్‌. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు' అని రచయిత పరుచూరి గోపాలకృష్ణ ట్వీట్ చేశారు.

రామజోగయ్య శాస్త్రి, బీవీఎస్‌ రవి, మంచు మనోజ్, శ్రీను వైట్ల, నాగ శౌర్య, నవదీప్, థమన్, నాగ వంశీ, బ్రహ్మాజీ.. తదితరులు పవన్‌ కల్యాణ్‌కు బర్త్ డే విషెష్ తెలిపారు. అయితే నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ చేసిన ట్వీట్ మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది. పవన్ అంటే చచ్చిపోయే బండ్ల.. సమయం వచ్చినపుడల్లా ఆయనపై అభిమానం చూపిస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి తన అభిమానాన్ని చూపెట్టారు. 'ఈ విశ్వంలో సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే.. పవన్ ఈశ్వరుడు ఒక్కడే. మా దేవరకు జన్మదిన శుభాకాంక్షలు' అని  బండ్ల ట్వీట్ చేశారు. 

Also Read: తొడకొట్టాడు తెలుగోడు.. అభిమానులకు పండగే పో! గూస్‌బంప్స్ తెస్తోన్న 'పవర్ గ్లాన్స్'

Also Read: Prakasam: అర్ధరాత్రి పెను ప్రమాదం.. లారీలో పేలిపోయిన వందల గ్యాస్ సిలిండర్లు..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News