Amitabh Bachchan: 78వ వసంతంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ షెహన్‌షా

భారతీయ సినిమా దిగ్గజం అమితాబ్ బచ్చన్‌ నేటితో (అక్టోబర్ 11)  78వ వసంతంలోకి అడుగుపెట్టారు. దీంతో బాలీవుడ్ రారాజుకి ప్రపంచంలోని నలుదిక్కుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఐదు దశాబ్దాలుగా భారత సినీ ఇండస్ట్రీని ఎలుతూ.. కోట్లాది మంది హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని.. బాలీవుడ్ సూపర్ స్టార్.. మెగాస్టార్‌గా పేరు ప్రఖ్యాతలను పొందారు నట దిగ్గజం అమితాబ్ బచ్చన్.

Last Updated : Oct 11, 2020, 09:15 AM IST
Amitabh Bachchan: 78వ వసంతంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ షెహన్‌షా

Happy birthday Amitabh Bachchan: న్యూఢిల్లీ: భారతీయ సినిమా దిగ్గజం అమితాబ్ బచ్చన్‌ (Amitabh Bachchan) నేటితో (అక్టోబర్ 11)  78వ వసంతంలోకి అడుగుపెట్టారు. దీంతో బాలీవుడ్ రారాజుకి ప్రపంచంలోని నలుదిక్కుల నుంచి (Happy birthday Amitabh Bachchan) శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఐదు దశాబ్దాలుగా భారత సినీ ఇండస్ట్రీని ఎలుతూ.. కోట్లాది మంది హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని.. బాలీవుడ్ (Bollywood) సూపర్ స్టార్.. మెగాస్టార్‌గా పేరు ప్రఖ్యాతలను పొందారు నట దిగ్గజం అమితాబ్ బచ్చన్. ఆయన పురాతన కాలం నటుడైనప్పటికీ.. 78 ఏళ్ల వయసులో తన చలాకీతనం.. నటనానైపుణ్యాలతో.. ఇప్పటికీ ఎంతోమంది అగ్రనటులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. Also read: Amitabh Bachchan: బచ్చన్ ఇంటికి మరింత భద్రత

అయితే.. అమితాబ్ బచ్చన్ 1942 అక్టోబర్ 11న అలహాబాద్‌లో ప్రసిద్ధ కవి హరివంష్ రాయ్ బచ్చన్, తేజీ బచ్చన్ దంపతులకు జన్మించారు. సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన తరువాత ఆయన నటి జయ బచ్చన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు కుమార్తె శ్వేతా బచ్చన్ నందా, కుమారుడు అభిషేక్ బచ్చన్ ఉన్నారు. కుమారుడు అభిషేక్ తన తల్లిదండ్రుల అడుగుజాడలను అనుసరిస్తూ నటవారసుడిగా పేరును సంపాదించుకున్నారు. అభిషేక్ కొన్నేళ్ల క్రితం నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.  Also read: Prabhas: ప్రభాస్ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్

అమితాబ్ బచ్చన్ తన కేరీర్‌లో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటించారు. అందుకే ఆయన సినిమాలు వచ్చాయంటే.. అభిమానుల్లో పండుగ లాంటి వాతావరణం ఏర్పడుతుంది. తన నటనా నైపుణ్యంతో బిగ్ బీ అనేక అవార్డులు.. ప్రశంసలను పొందారు. ఇప్పటివరకు బాలీవుడ్ మెగాస్టార్ ఐదు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 15 ఫిలింఫేర్ అవార్డులు, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో అనేక పురస్కారాలను కైవసం చేసుకున్నారు. దీంతోపాటు భారత ప్రభుత్వం బీగ్‌ బీకి 1984 లో పద్మశ్రీ, 2001 లో పద్మ భూషణ్, 2015 లో పద్మ విభూషణ్ను ప్రదానం చేసింది. అంతేకాకుండా 2018 లో నటదిగ్గజానికి అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో కూడా సత్కరించారు. Also read: Prabhas Updates: బిగ్ బీ పాత్ర పేరే ప్రభాస్ మూవీ టైటిల్…నాగ్ అశ్విన్ క్లారిటీ

అమితాబ్ బచ్చన్ 1969 లో 'సాత్ హిందుస్తానీ' అనే తొలి హిందీ చిత్రంతో ఆరేంగ్రేటం చేశారు. అప్పటినుంచి ఆయన వెనుకకు తిరిగి చూడలేదు. 'దీవార్', 'షోలే', 'జంజీర్', 'డాన్', 'కూలీ', 'సిల్సిలా', 'ముకద్దర్ కా సికందర్', 'సర్కార్', ఇలా మరెన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో ప్రభంజనాన్ని సృష్టించారు. చివరిసారిగా అమితాబ్ బచ్చన్ చివరిసారిగా 'గులాబో సీతాబో'లో కనిపించారు. ప్రస్తుతం ఆయన ఝండ్, బ్రహ్మాస్త్రా, చెహ్రేతోపాటు.. ప్రభాస్ సినిమాలో నటిస్తున్నారు. అంతేకాకుండా బాలీవుడ్ మెగాస్టార్ 'కౌన్ బనేగా కరోడ్‌పతి 12 సిజన్‌తో కూడా తన అభిమానులను అలరిస్తున్నారు. Also read : China on coronavirus: కరోనావైరస్ పుట్టింది చైనాలో కాదు: చైనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News