Hanu Man OTT Streaming: సడెన్ సర్‌ప్రైజ్.. రెండు ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసిన హనుమాన్ మూవీ..

Hanu Man OTT Streaming: హనుమాన్ సినిమా ఈ యేడాది పెద్ద హీరోల సినిమాల మధ్య విడుదలైన సంచలన విజయం సాధించింది. సంక్రాంతి కానుకగా ఈ యేడాది విడుదలైన ఈ సినిమా పెద్ద హీరోల సినిమాల రికార్డులను ఈజీగా క్రాస్ చేసింది. ఇప్పటికే థియేటర్స్‌లో రన్ అవుతున్న ఈ సినిమా ఓటీటీలోకి ఎపుడెపుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తాజాగా హనుమాన్‌ మూవీ రెండు ఓటీటీల్లో వచ్చేసి అభిమానులకు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 17, 2024, 12:24 PM IST
Hanu Man OTT Streaming: సడెన్ సర్‌ప్రైజ్.. రెండు ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసిన హనుమాన్ మూవీ..

Hanu Man OTT Streaming: హనుమాన్ సూపర్ హీరోలను మించి అసలు సిసలైన కథానాయకుడు.  బిందువు, బిందువు కలిసి సింధువు అయినట్టు చిన్న సినిమాగా విడుదలైన 'హనుమాన్' మూవీ అందరి అంచనాలను మంచి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.  అంతేకాదు ఈ సినిమా విడుదలకు ముందు  ఆ తర్వాత ఎన్నో రికార్డులను తన పేరిట రాసుకుంది. ఇక థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు గత కొన్ని రోజులుగా ఎదురు చేస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 2 నుంచి  ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నట్టు ప్రకటించినా.. ఆ తర్వాత ఎందుకో స్ట్రీమింగ్ కాలేదు. తాజాగా ఈ సినిమాను అర్దరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ అయిన జీ 5, జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది.హనుమాన్ సినిమా 2024లో తొలి హిట్‌గా నిలిచింది. ఈ మూవీ గురించి ప్రశాంత్ వర్మ గత రెండేళ్లుగా ఎంతో శ్రమించాడు. విడుదల సమయంలో సరైన థియేటర్స్ కూడా దొరకలేదు. అయినా.. ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి విజేతగా నిలిచి గెలిచింది. బడా హీరోలను తలదన్నే బాక్సాఫీస్ వసూళ్లను రాబట్టింది. అంతేకాదు ఇప్పటి వరకు విడుదలైన పొంగల్ చిత్రాల్లో హైయ్యెస్ట్‌ గ్రాసర్‌గా టాలీవుడ్ చరిత్రలో మరో రికార్డును తన పేరిట లిఖించుకుంది.

ఇక బాక్సాఫీస్ దగ్గర హను మాన్ దూకుడు ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి కొనసాగింది. విడుదలకు ఒక రోజు ముందు ప్రీమియర్స్ ద్వారానే దాదాపు రూ.3 కోట్లకు పైగా షేర్.. రూ. 6 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ సినిమా మీడియం రేంజ్ చిన్న చిత్రాల్లో  సరికొత్త బెంచ్ మార్క్  క్రియేట్ చేసింది. అంతేకాదు హనుమాన్.. విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని కొత్త సంచనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అంతేకాదు 2024లో టాలీవుడ్‌లోనే.. మన దేశంలోనే తొలి హిట్‌గా నిలిచింది హనుమాన్ మూవీ.  అంతేకాదు అమెరికా బాక్సాఫీస్ దగ్గర $ 5 మిలియన్ యూఎస్ కలెక్ట్ చేసి టాప్ 5లో నిలిచింది.

హనుమాన్ మూవీ రూ. 29.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ రూ. 30.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ మూవీ ఇప్పటి వరకు థియేట్రికల్‌గా రూ.100 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చి టాలీవుడ్‌లో మరే బడా హీరోలకు సైతం సాధ్యం కానీ రికార్డులను నెలకొల్పింది. గత కొన్నేళ్గుగా ఓ సినిమా థియేట్రికల్‌గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడమే గగనమై పోతున్న ఈ రోజుల్లో ఈ మూవీ థియేట్రికల్‌గా రూ. 100 కోట్ల లాభాలను ఆర్జించడం మాములు ఊచకోత కాదు. ఇదో రేర్ ఆఫ్ ది రేర్ అని చెప్పాలి.

ఈ సినిమా దాదాపు రూ. 300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన తొలి మీడియం రేంజ్ సంక్రాంతి సినిమాగా హనుమాన్ మరో రికార్డు. హిందీలో 'హనుమాన్' రూ. 50 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా తెలంగాణ, రెస్ట్ ఆఫ్ భారత్, ఓవర్సీస్, హిందీలో రూ. 50 కోట్ల గ్రాస్ అందుకున్న తొలి సినిమాగా రికార్డు నెలకొల్పింది. హనుమాన్ సినిమాను ఇప్పటి వరకు  థియేటర్స్‌లో కోటి మందికి పైగా వీక్షించారు. అది కూడా మాములు రికార్డు కాదు.

మరోవైపు ఈ మూవీ డిజిటల్, శాటిలైట్ రూపేణా..మరో రూ. 50 కోట్ల అదనపు లాభాలను నిర్మాతకు తీసుకొచ్చింది. ఓవరాల్‌గా అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం జరిగిన ఈ శుభవేళలో హను మాన్ సినిమా తెలుగు సహా ఇతర భాషల్లో మంచి వసూళ్లను రాబట్టడం శుభ పరిణామం. ఈ  చిత్రాన్ని తెలుగు,హిందీ తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఇప్పటికే విడుదల చేయగా... మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ లాంగ్వేజిస్ లోనూ విడుదల  చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఇప్పటికే ఆయా భాషలకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రఖని, గెటప్ శ్రీను ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం "విజువల్ ఫీస్ట్"గా నీరాజనాలు అందుకుంది. మరి థియేట్రికల్‌గా మంచి విజయం సాధించిన ఈ సినిమా ఓటీటీలో ఏ మేరకు సూపర్ హిట్ అవుతుందో చూడాలి.

ఆ సంగతి పక్కన పెడితే.. హనుమాన్ మూవీ క్లైమాక్స్‌లో ఈ మూవీకి సీక్వెల్‌గా 'జై హనుమాన్' మూవీ తెరకెక్కించబోతున్నట్టు దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రకటించారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను అయోధ్య భవ్య రామ మందిరంలో బాల రాముడు కొలువైన శుభవేళలో ప్రకటించడం విశేషం. ఈ మూవీలో రానా ముఖ్యపాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.  మొత్తంగా 'హనుమాన్'మూవీతో ప్యాన్ ఇండియా లెవల్లో సంచలనం రేపిన ప్రశాంత్ వర్మ.. రాబోయే 'జై హనుమాన్' మూవీతో ఎలాంటి సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిస్తుందో చూడాలి.

Also read: Bhatti Vikramarka: భట్టి విక్రమార్కకు ఇఫ్తార్ విందులో అవమానం.. వైరల్ గా మారిన వీడియో ఇదే...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News