Hanu Man 100 Days: హనుమాన్ మూవీ మరో అద్భుతం.. హనుమాన్ జయంతి ఒక రోజు ముందు 100 రోజుల పరుగు పూర్తి..

Hanu Man 100 Days: హనుమాన్ మూవీ మరో అద్భుతం సాధించింది.  ఈ సినిమా ఈ సంక్రాంతి కానుకగా విడుదలై అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 100 రోజుల పరుగును కంప్లీట్ చేసుకుంది. అది కూడా హనుమాన్ జయంతికి ఒక రోజు ముందు ఈ ఫీట్ అందుకోవడం మరో విశేషం.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 22, 2024, 03:02 PM IST
Hanu Man 100 Days: హనుమాన్ మూవీ మరో అద్భుతం.. హనుమాన్ జయంతి ఒక రోజు ముందు 100 రోజుల పరుగు పూర్తి..

Hanu Man 100 Days: 'హనుమాన్'  ఈ పేరు చాలు బాక్సాఫీస్‌ కలెక్షన్లు కొల్లగొట్టడానికీ. హనుమాన్ అనే బ్రాండ్ పేరుతోనే ఈ సినిమా తెలుగులో సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులు నమోదు చేసింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో ముఖ్యపాత్రలో నటించిన ఈ సినిమా ప్రీమియర్స్ నుంచే బాక్సాఫీస్ దగ్గర ట్రెమెండెస్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అంతేకాదు ఈ సినిమా థియేటర్స్‌లో రన్ అవుతుండగానే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ కూడా ఈ సినిమా అనూహ్యమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక హిందీలో కూడా దాదాపు రూ. 50కోట్ల నెట్ వసూళ్లను వసూళ్లు సాధించి అక్కడ బాక్సాఫీస్ దుమ్ము దులిపింది. ఈ డిజిటల్ యుగంలో ఒక సినిమా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న టైమ్‌లో ఈ సినిమా 25 కేంద్రాల్లో 100 రోజుల పరుగును పూర్తి చేసుకోవడం విశేషం. జీ5లో హనుమాన్ 8 భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ మధ్య కాలంలో బాలయ్య, చిరంజీవి వంటి హీరోల సినిమాలకు మాత్రమే 100 రోజుల పోస్టర్ కనిపిస్తోంది. ఈ డిజిటల్ యుగంలో ఓ చిన్నహీరో నటించిన హనుమాన్ సినిమా 100 రోజుల పూర్తి చేసుకోవడం మాములు విషయం కాదు. ఆ రికార్డు హనుమాన్ మూవీ సాధించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాపతంగా దాదాపు రూ. 160 కోట్ల షేర్ (రూ. 310 కోట్ల గ్రాస్ ) వసూళ్లను సాధించింది. అంతేకాదు రూ. 28 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా దాదాపు రూ. 120 కోట్ల పైగా లాభాలను అందుకున్న చిత్రంగా రికార్డులు క్రియేట్ చేసింది.

 
 ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్' మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇక హనుమాన్ సినిమాలో అంజనాద్రి అంటూ ఓ కల్పిత గ్రామాన్ని పెట్టి ఆడియన్స్‌ను ఆశ్చర్యచకితులను చేసిన ప్రశాంత్ వర్మ.. హనుమాన్ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న 'జై హనుమాన్' మూవీలో అంజనాద్రి 2.O అంటూ మరో కల్పిత గ్రామాన్ని క్రియేట్ చేసాడు. సముద్రంలో అందమైన కొండలతో ఈ గ్రామం చూడచక్కగా ఉంది. ఇక జై హనుమాన్ సినిమా కథ ఎలా ఉండబోతుందో చూడాలి. బడా హీరోలను తలదన్నే బాక్సాఫీస్ వసూళ్లను రాబట్టింది హనుమాన్ మూవీ. అంతేకాదు ఇప్పటి వరకు విడుదలైన పొంగల్ చిత్రాల్లో హైయ్యెస్ట్‌ గ్రాసర్‌గా టాలీవుడ్ చరిత్రలో మరో రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఈ మూవీలో రానా ముఖ్యపాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.  మొత్తంగా 'హనుమాన్'మూవీతో ప్యాన్ ఇండియా లెవల్లో సంచలనం రేపిన ప్రశాంత్ వర్మ.. రాబోయే 'జై హనుమాన్' మూవీతో ఎలాంటి సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుందో చూడాలి.

Also Read: TDP Candidates Change: ఎన్నికల వేళ టీడీపీ భారీ ట్విస్ట్‌.. రఘురామ కృష్ణంరాజుకు ఛాన్స్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News