Gutta Jwala, Vishnu Vishal పెళ్లికి డేట్ ఫిక్స్.. ట్విటర్‌లో వెడ్డింగ్ కార్డ్

Gutta Jwala, Vishnu Vishal wedding date: బ్యాడ్మింటన్ ఛాంపియన్ గుత్తా జ్వాల పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ కాబోతోంది. ఇంతకీ వరుడు ఎవరో తెలుసు కదా.. తమిళ సినీ నటుడు విష్ణు విశాల్. చాలా కాలంగా ఒకరి ప్రేమలో ఒకరు మునిగితేలుతున్న జ్వాల గుత్తా, విష్ణు విశాల్ ఇటీవలే లాక్‌డౌన్ సమయంలోనే ఎంగేజ్‌మెంట్ (Gutta Jwala, Vishnu Vishal engagement) చేసుకున్నారు. వీళ్లిద్దరికీ కూడా ఇది రెండో పెళ్లినే (Second marriage).

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 13, 2021, 07:36 PM IST
  • సెప్టెంబర్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న గుత్తా జ్వాల, విష్ణు విశాల్..
  • గతంలో చేతన్ ఆనంద్‌ని పెళ్లి చేసుకుని డైవర్స్ (Divorce) తీసుకున్న జ్వాలా గుత్తా.
  • రజినీని వివాహం చేసుకుని ఆమెకు డైవర్స్ ఇచ్చిన విష్ణు విశాల్..
Gutta Jwala, Vishnu Vishal పెళ్లికి డేట్ ఫిక్స్.. ట్విటర్‌లో వెడ్డింగ్ కార్డ్

Gutta Jwala, Vishnu Vishal wedding date: బ్యాడ్మింటన్ ఛాంపియన్ గుత్తా జ్వాల పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ కాబోతోంది. ఇంతకీ వరుడు ఎవరో తెలుసు కదా.. తమిళ సినీ నటుడు విష్ణు విశాల్. చాలా కాలంగా ఒకరి ప్రేమలో ఒకరు మునిగితేలుతున్న జ్వాల గుత్తా, విష్ణు విశాల్ ఇటీవలే లాక్‌డౌన్ సమయంలోనే ఎంగేజ్‌మెంట్ (Gutta Jwala, Vishnu Vishal engagement) చేసుకున్నారు. వీళ్లిద్దరికీ కూడా ఇది రెండో పెళ్లినే (Second marriage). హైదరాబాద్‌కి చెందిన గుత్తా జ్వాల, చెన్నైకి చెందిన విష్ణు విశాల్ చివరకు ఇలా ఈ పెళ్లితో ఒకింటి వారవుతున్నారన్నమాట. తమ పెళ్లికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఇదిగో ఇలా ట్విటర్‌లో పోస్ట్ చేసింది ఆ జంట. 

ట్విటర్‌లో ఆహ్వాన పత్రికను పోస్ట్ చేశారు కదా అని ఈ పెళ్లికి అందరికీ ఆహ్వానం ఉందని అనుకోకండి. ఎందుకంటే కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో కొవిడ్-19 మార్గదర్శకాలు (COVID-19 guidelines) అమలులో ఉన్న దృష్ట్యా లాక్‌డౌన్‌లో జరిగిన ఎంతో మంది సెలబ్రిటీల పెళ్లిళ్ల మాదిరిగానే వీళ్ల పెళ్లి కూడా అత్యంత సమీప బంధుమిత్రుల మధ్యే జరగనుంది. ఈ విషయాన్ని కూడా గుత్తా జ్వాల, విష్ణు విశాల్ తమ వెడ్డింగ్ కార్డులో (Gutta Jwala, Vishnu Vishal wedding card) పేర్కొన్నారు. 

Also read : బాలకృష్ణ BB3 మూవీకి Akhanda టైటిల్

ఇప్పటివరకు తమను ఎలాగైతే ఆదరించి, ఆశీర్వదించారో.. ఇకపై కూడా అలాగే తమను ఆశీర్వదించండి అంటూ గుత్తా జ్వాల, విష్ణు విశాల్ (Gutta Jwala, Vishnu Vishal) విజ్ఞప్తి చేశారు. 2001లో రజినీని పెళ్లి చేసుకున్న విష్ణు విశాల్‌ రెండేళ్ల క్రితమే ఆమెకు విడాకులు ఇవ్వగా.. 2005లో బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ చేత‌న్ ఆనంద్‌ని పెళ్లి చేసుకున్న గుత్తా జ్వాల (Gutta Jwala's ex-husband Chetan Anand) 2011లో చేతన్‌కి విడాకులు ఇచ్చింది. మళ్లీ ఇలా ఈ పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఇద్దరూ ప్లాన్ చేసుకుంటున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News