శుక్రవారం వచ్చిందంటే చాలు.. థియేటర్లలో సినిమాల హాడావిడీ అంతా ఇంతా ఉండదు. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని తేడా లేకుండా అన్ని సినిమాలు వీకెండ్ లో వారికి అనుకూలంగా విడుదలకు సిద్ధం అవుతుంటాయి. అయితే రాబోయే శుక్రవారం.. అనగా అక్టోబర్ 6 న చాలా సినిమాలు విడుదలకు సిద్ధం అయ్యాయి.
నిజానికి అక్టోబర్ 6 మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న సలార్ సినిమా విడుదల కావాల్సింది. కానీ అనివార్య కారణాల వలన సలార్ సినిమా పోస్ట్ పోన్ అవ్వటంతో.. ,చిన్న సినిమాలకు విడుదలకు సిద్ధం అయ్యాయి. ఈ సందర్భంగా అక్టోబర్ 6 న దాదాపు అరడజను సినిమాలు విడుదలకు సిద్ధం అయ్యాయి.
సలార్ సినిమా అక్టోబర్ 6 న విడుదల అవుతున్నదని.. చాలా సినిమాలు వారి విడుదల తేదీని పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఒక్క సలార్ సినిమా విడుదల తేదీ పోస్ట్ పోన్ అవ్వటంతో చిన్న సినిమాల విడుదల తేదీలను మల్లి మార్చాయి. ఇక విషయానికి వస్తే..
సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన రూల్స్ రంజన్. కానీ ఒక వారం వాయిదా పడి.. అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అక్టోబర్ 6నే జూ. ఎన్టీఆర్ బావమరిది హీరోగా నటిస్తున్న మాడ్ సినిమా కూడా విడుదల కాబోతుంది. అవుతోంది. మహేష్ బాబు కుటుంబం నుండి హీవుగా వచ్చిన సుధీర్ బాబు సినిమాకూడా ఆ రోజునే విడుదల కావటం విశేషం. ఈ సినిమా పేరు "మామా మశ్చీంద్ర", భిన్న పాత్రలలో నటిస్తున్న సుధీర్ బాబు చిత్రానికి రచయిత, నటుడు హర్ష వర్ధన్ ఈ సినిమాకి దర్శకుడిగా వహిస్తున్నారు.
Also Read: Cash Insurance News: బ్యాంకు లాకర్లలో క్యాష్‌కి ఇన్సూరెన్స్ ఉంటుందా ?
వీరితో పాటుగా అక్టోబర్ 6న చిన్న సినిమా అయిన.. అభయ్ నవీన్ హీరోగా నటిస్తున్న 'రాక్షస కావ్యం' చిత్రం కూడా రేసులో ఉంది. అసలు విషయం ఏంటంటే.. అదే అక్టోబర్ 6న నవీన్ చంద్ర హీరోగా.. కలర్స్ స్వాతి హీరోయిన్ గా నటిస్తున్న "మంత్ ఆఫ్ మధు" అనే సినిమా కూడా విడుదల కాబోతుంది. ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి.
ఇప్పటి వరకు చెప్పిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే.. వీరితో పాటుగా.. శ్రీలంక క్రికెట్ జట్టు బౌలర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ '800' సినిమా కూడా అదే రోజున విడుదల అవుతుంది. అర డజన్ కు పైగా సినిమాలు విడుదల కావటంతో.. సినీ ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి. వీటిలో ఏది ప్రేక్షకులను అలరిస్తుందో.. ఏది బాక్సాఫీస్ వద్ద చతికిల పడుతుందో చూడాలి మరీ!
Also Read: Ap Heavy Rains: ఏపీలో రానున్న 48 గంటలు ఆ జిల్లాలకు అతి తీవ్ర వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook