Adipurush Movie: ఆదిపురుష్ యూనిట్‌కు గుడ్‌న్యూస్.. టికెట్ ధర పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతి

Adipurush Movie: ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మరో పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ విడుదల నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. టికెట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 16, 2023, 06:17 PM IST
Adipurush Movie: ఆదిపురుష్ యూనిట్‌కు గుడ్‌న్యూస్.. టికెట్ ధర పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతి

Adipurush Movie: రామాయణ ఇతివృత్తంతో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ నటీనటులుగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం మరి కొద్దిగంట్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం విడుదల పురస్కరించుకుని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు వెసులుబాట్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. 

ప్రభాస్ రాముడి పాత్రలో, కృతి సనన్ సీత పాత్రలో నటించిన ఆదిపురుష్ పాన్ ఇండియా సినిమా ఈ నెల 16వ తేదీన విడుదలకు సిద్ధమైంది. భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్ర యూనిట్‌కు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. టికెట్లు పెంచుకునేందుకు అనుమతిచ్చింది. విడుదలైన తొలి పదిరోజులు ప్రతి టికెట్‌కు 50 రూపాయలు పెంచుకునేలా వెసులుబాటు కల్పించింది. ఈ వెసులుబాటు తొలి పదిరోజులే వర్తిస్తుంది.

అటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆదిపురుష్ సినిమా టికెట్లు 50 రూపాయలు చొప్పున పెంచుకునేందుకు ఇప్పటికే అనుమతిచ్చింది. అయితే తెలంగాణలో మాత్రం తొలి మూడ్రోజులు సింగిల్ స్క్రీన్స్‌కు 50 రూపాయలు ప్రతి టికెట్‌పై పెంచుకునేందుకు అనుమతి ఉంది. కాగా రోజుకు ఆరు షోలు వేసుకోవచ్చు. ఏపీలో అన్ని థియేటర్లలోనూ పెంచుకోవచ్చు.

Also Read: నేటి నుండి మూడు రోజులపాటు ఈరాశుల ఇళ్లపై డబ్బు వర్షం... మీరున్నారా?

రామాయణం ఇతివృత్తంతో రూపొందిన ఆదిపురుష్ సినిమాలో రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కన్పించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆన్‌లైన్ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ సైట్స్ క్రాష్ అవుతున్నాయి. ఇప్పటికే చాలా థియేటర్లలో టికెట్స్ హౌస్‌ఫుల్ అయినట్టు తెలుస్తోంది. 

Also Read: Adipurush Movie: ఆదిపురుష్‌ మూవీని ఊరిస్తున్న ఓపెనింగ్ డే రికార్డులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News