Godfather Poster: 'గాడ్‌ ఫాదర్' నుంచి మరో పోస్టర్.. రియల్ గ్యాంగ్‌స్టర్ వచ్చేశాడు!

Chiranjeevi starrer Godfather movie Poster released. చిరంజీవి 'గాడ్‌ ఫాదర్' సినిమా నుంచి మరో పోస్టర్‌ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  

Written by - P Sampath Kumar | Last Updated : Jul 5, 2022, 10:16 PM IST
  • గాడ్‌ ఫాదర్ నుంచి మరో పోస్టర్
  • రియల్ గ్యాంగ్‌స్టర్ వచ్చేశాడు
  • లైకుల వర్షం కురిపిస్తున్న మెగా అభిమానులు
Godfather Poster: 'గాడ్‌ ఫాదర్' నుంచి మరో పోస్టర్.. రియల్ గ్యాంగ్‌స్టర్ వచ్చేశాడు!

Chiranjeevi starrer Godfather movie Poster released: టాలీవుడ్ 'మెగాస్టార్' చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. గాడ్‌ ఫాదర్, బోళా శంకర్ సినిమాలు చేస్తూనే.. మరిన్ని సినిమాలను లైన్‌లో పెట్టారు. అయితే మలయాళంలో విజయవంతమైన 'లూసీఫర్‌' సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న గాడ్‌ ఫాదర్ చిత్రంను త్వరగా రిలీజ్ చేసేందుకు చిరు ప్రయత్నాలు చేస్తున్నారు. మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్‌, సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌ పతాకాలపై ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. 

గాడ్‌ ఫాదర్ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తో పాటు వీడియో గ్లింప్స్‌ను సోమవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈరోజు మరో పోస్టర్‌ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో చిరంజీవి గాగుల్స్ పెట్టుకుని స్టయిల్‌ కూర్చుని అదిరే లుక్‌లో స్టెలిష్‌గా ఉన్నారు. 'ది రియల్ గ్యాంగ్‌స్టర్' అని కూడా రాసుంది. ఈ పోస్టర్‌ను 'చిరంజీవి కొణిదెల ఫాన్స్ క్లబ్' అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేయబడింది. ఈ పోస్టర్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మెగా అభిమానులు లైకుల వర్షం కురిపిస్తున్నారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Chiranjeevikonidela 🔵 (@chiranjeevikonidelafc.k)

పొలిటికల్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్న గాడ్‌ ఫాదర్ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్‌, హీరో సత్యదేవ్‌, నటుడు సునీల్ ఇతర ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రచంచవ్యాప్తంగా భారీస్థాయిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక తమన్‌ సంగీతం సమకూర్చుతున్నారు. 

Also Read: Krithi Shetty Pics: కొంటె చూపుతో కైపెక్కిస్తున్న కృతి శెట్టి.. బేబమ్మ అందాలు మరో లెవల్!  

Also Read: Crocodile Video: మొసలి నోట్లో చేయి పెట్టాడు.. మూల్యం చెల్లించుకున్నాడు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

 

Trending News