Leo Movie: 'లియో' గురించి రిలీజ్ కు ముందే రివ్యూ చెప్పేసిన గౌతమ్ మీనన్, వీడియో వైరల్

Leo Movie: త్వరలో ఆడియెన్స్ ముందుకు రాబోతున్న విజయ్ లియో గురించి నటుడు కమ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మీరు ఈ వీడియో చూసేయండి మరి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 1, 2023, 04:53 PM IST
Leo Movie: 'లియో' గురించి రిలీజ్ కు ముందే రివ్యూ చెప్పేసిన గౌతమ్ మీనన్, వీడియో వైరల్

Gautham Vasudev Menon:  కోలీవుడ్ స్టార్‌ హీరో దళపతి విజయ్ (Vijay) లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘లియో’ (Leo.. Bloody Sweet). ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌కు లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబరు 19న ఆడియెన్స్ ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, గ్లింప్స్, ఫస్ట్‌ సింగిల్ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేశాయి. ‘మాస్టర్‌ తర్వాత విజయ్‌-లోకేశ్‌ కాంబోలో వస్తోన్న సినిమా కావడంతో లియోపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియోస్ నిర్మిస్తుంది. 

అయితే తాజాగా ఈ మూవీ గురించి నటుడు కమ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ''‘లియో’ మైండ్‌ బ్లోయింగ్ మూవీ. నా డబ్బింగ్‌ సమయంలో ‘లియో’లోని కొన్ని సీన్స్‌ చూశా. సినిమా సూపర్‌గా వచ్చింది. విజయ్‌తో వర్క్‌ చేయడం మంచి అనుభూతి'' అంటూ గౌతమ్ మీనన్ ఓ ఈవెంట్‌లో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ వీడియోను చూసిన‌ విజయ్ ఫ్యాన్స్ ‘లియో’ బ్లాక్ బస్టర్ హిట్టు అంటూ తెగ వైర‌ల్ చేస్తున్నారు.

చాలా ఏళ్ల తర్వాత విజయ్ సరసన త్రిష నటిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్, అర్జున్ సార్జా, ప్రియా ఆనంద్‌, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్‌, గౌతమ్ వాసు దేవ్‌మీనన్‌, మిస్కిన్‌, మాథ్యూ థామస్‌, సాండీ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. రిలీజ్ కాకముందే ఈ మూవీ యూఎస్, యూకేలో రికార్డు స్థాయి బుకింగ్స్ నమోదు చేసుకుంటుందట. దీంతో లియోపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థమవుతోంది.

Also read: Tiger Nageswara Rao Update: ఆసక్తి రేకెత్తిస్తున్న రేణూదేశాయ్ న్యూ లుక్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News