GarikaPati - Chiranjeevi : అదృష్టం కొద్దీ చిరంజీవి అధికారంలోకి రాలేదు.. గరికపాటి నాటి వీడియో వైరల్

GarikaPati Narasimha in Open Heart With RK Show చిరంజీవి గరికపాటి వివాదం ఇంకా వేడిగానే ఉంది. వివాదం అంతా చల్లారిందని అనుకుంటూ ఉంటే.. మధ్యలోకి రామ్ గోపాల్ వర్మ వచ్చి మరింత అగ్గిరాజేశాడు. ఇప్పుడు గరికపాటి గతంలో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 11, 2022, 12:58 PM IST
  • చిరంజీవిపై గరికపాటి అసహనం
  • మండిపడ్డ మెగా అభిమానులు
  • గరికపాటి నాటి వీడియో వైరల్
GarikaPati - Chiranjeevi : అదృష్టం కొద్దీ చిరంజీవి అధికారంలోకి రాలేదు.. గరికపాటి నాటి వీడియో వైరల్

GarikaPati - Chiranjeevi : గరికపాటి చిరంజీవి ఇష్యూ కాస్త చల్లారిందని అంతా అనుకున్నారు. గత నాలుగైదు రోజులుగా గరికపాటి మీద మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా దాడి చేస్తూనే ఉన్నారు. అలయ్ బలయ్ కార్యక్రమంలో మహిళలంతా వచ్చి.. చిరంజీవి సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటారు. ఆ సమయంలో ప్రవచనాలు చెప్పేందుకు రెడీగా ఉన్న గరికపాటి.. సెల్ఫీ సెషన్ మీద ఫైర్ అయ్యాడు. ఫోటో సెషన్ ఆపేయండంటూ చిరు మీద అసహనం వ్యక్తం చేశాడు. ఆ తరువాత చిరంజీవి తన మంచి మనసును చాటుకున్నాడు. గరికపాటి మీద కోపాన్ని కాకుండా ప్రేమను కురిపించాడు.

కానీ నాగబాబు, ఇతర అభిమానులు మాత్రం గరికపాటిని ప్రత్యక్షంగా, పరోక్షంగా చీల్చిచెండాడారు. ఈ ఘటనలో గరికపాటిది తప్పని అందరూ తేల్చి చెప్పేశారు. కానీ చిరంజీవి గొప్పదనం పదింతలు పెరిగిందని అందరూ అన్నారు. నాగబాబు మధ్యలోకి దూరి ట్వీట్ చేయడం వివాదం మరింత ఎక్కువైందనే అభిప్రాయం సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. గరిక పాటితో క్షమాపణలు చెప్పించుకోవాలనే ఉద్దేశ్యం మాకు లేదని చివరకు నాగబాబు ట్వీట్ వేశాడు.

కానీ మెగా అభిమానులు మాత్రం ఇప్పటికీ గరికపాటిని వదలడం లేదు. చిరంజీవికి క్షమాపణలు చెబుతున్నాను అని గరికపాటి అన్నా కూడా వదలలేదు. గతంలో గరికపాటి మాట్లాడిన మాటలను ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో గరికపాటి మాట్లాడుతూ చిరంజీవి గురించి వెటకారంగా అన్న మాటలు ఇప్పుడు వైరల్అవుతున్నాయి.

 

ఆయన అదృష్టం కొద్దో.. మన అదృష్టం కొద్దో అయన అధికారంలోకి రాలేదు అంటూ చిరంజీవి మీద వెటకారపు కామెంట్లు చేశాడు గరికపాట. అంటే చిరంజీవి మీద ముందు నుంచి కూడా మీకు అసూయ, ద్వేషం ఉందా? అంటూ గరికపాటి మీద నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది.

ఇక వర్మ వేసస్తోన్న వరుస ట్వీట్లు, గరికపాటిని విమర్శిస్తున్న తీరు అందరికీ తెలిసిందే. సడెన్‌గా వర్మ ఇలా యూటర్న్ ఎందుకు తీసుకున్నాడు.. చిరంజీవిని పొగుడుతూ.. గరికపాటిని తిడుతూ వర్మ వేస్తోన్న ట్వీట్లు గందరగోళానికి దారి తీస్తున్నాయి. వాడికి పద్మ ఎక్కువ.. పద్మశ్రీ ఎందుకు అంటూ ఇలా వర్మ దారుణంగా ట్వీట్లు వేస్తున్నాడు.

Also Read : Ram Charan Trujet : దివాలతీసిన రామ్ చరణ్ కంపెనీ

Also Read : Samantha : నువ్ ఎప్పటికీ ఒంటరిగా నడవలేవు!.. సమంత ఉద్దేశ్యం ఏంటి?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

 

Trending News