Game Changer: జవనరి 2న ‘గేమ్ ఛేంజర్’ మూవీ నుంచి రామ్ చరణ్ ఫ్యాన్స్ కు స్పెషల్ సర్ ప్రైజ్..

Game Changer: రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’.  ‘వినయ విధేయ రామ’ సినిమా తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’ కావడం విశేషం. ఈ కొత్త యేడాదిలో విడుదల కాబోతున్న తొలి భారీ చిత్రం ఇదే కావడం విశేషం. విడుదలకు దగ్గర పడుతున్న ఈ సినిమా ట్రైలర్ కు రేపు (గురువారం) విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 1, 2025, 01:02 PM IST
Game Changer: జవనరి 2న ‘గేమ్ ఛేంజర్’ మూవీ నుంచి రామ్ చరణ్ ఫ్యాన్స్ కు  స్పెషల్ సర్ ప్రైజ్..

Game Changer: ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం  ‘గేమ్ చేంజ‌ర్‌’. ఈ సినిమాను తెలుగు, తమిళంతో పాటు హిందీలో విడుదల కాబోతుంది. తాజాగా  సినిమాకు సంబంధించి కౌంట్ డౌన్ షురూ అయ్యింది. మాస్ట‌ర్ ఫిల్మ్ మేక‌ర్ శంక‌ర్ ఈ చిత్రాన్ని పొలిటిక‌ల్ యాక్ష‌న్ డ్రామాను తెర‌కెక్కించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై అంచ‌నాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. మెగాభిమానులు, ప్రేక్ష‌కులు సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా! అని ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను  జ‌న‌వ‌రి 2న విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ‘గేమ్ చేంజ‌ర్‌’ నుంచి రిలీజైన సాంగ్స్‌, టీజ‌ర్‌, పోస్ట‌ర్స్‌, ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌తో ఎక్స్‌పెక్టేష‌న్స్ పెరిగిపోయాయి. ఇప్పుడు ట్రైల‌ర్ కోసం మెగాభిమానులతో పాటు కామన్ ఆడియన్స్  ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాలో  రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టించగా, అంజ‌లి మరో కథానాయికగా నటిస్తోంది. శ్రీకాంత్,  ఎస్‌.జె.సూర్య‌, సముద్ర‌ఖ‌ని, సునీల్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ స్టోరీని అందించారు.  ఎస్‌.యు.వెంక‌టేశ‌న్‌, వివేక్ రైట‌ర్స్‌గా పనిచేశారు. హ‌ర్షిత్ స‌హ నిర్మాత‌. ఎస్‌.తిరుణ్ణావుక్క‌ర‌సు సినిమాటోగ్ర‌ఫీ అందించారు. ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ మ్యూజిక్ అందించారు.  సాయి మాధ‌వ్ బుర్రా తెలుగు వెర్షన్ డైలాగ్స్ రాశారు. యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్స్‌గా అన్బ‌రివు, డాన్స్ డైరెక్ట‌ర్‌గా ప్ర‌భుదేవా, గ‌ణేష్ ఆచార్య‌, ప్రేమ్ రక్షిత్‌, బాస్కో మార్టిస్, జానీ, శాండీ వ‌ర్క్ చేసారు. తెలుగులో రామ్ జోగ‌య్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్‌, కాసర్ల శ్యామ్ ఈ సినిమాలోని పాట‌ల‌ను రాశారు.

గేమ్ చేంజ‌ర్‌ను దివంగత  శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై  దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్రాన్ని ఎస్‌వీసీ, ఆదిత్య‌రామ్ మూవీస్ సంస్థ‌లు త‌మిళంలో విడుద‌ల చేస్తుండగా హిందీలో ఏఏ ఫిలిమ్స్ అనిల్ తడాని రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సరిగమ ఆడియో పార్టనర్స్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News