'జాతిరత్నాలు' బ్యూటీకి బంపర్ ఆఫర్..నాగార్జునతో 'చిట్టి' స్పెషల్ సాంగ్..

నాగార్జున 'బంగార్రాజు'మూవీ షూటింగ్ పుల్ స్వింగ్ లో జరుగుతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి బయటకొచ్చింది. జాతిరత్నాల బ్యూటీ ఫరియా..నాగ్ తో స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 19, 2021, 04:12 PM IST
'జాతిరత్నాలు' బ్యూటీకి బంపర్ ఆఫర్..నాగార్జునతో 'చిట్టి' స్పెషల్ సాంగ్..

Bangarraju Movie : నాగార్జున(Akkineni Nagarjuna) హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బంగార్రాజు'. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల నాగలక్ష్మి పాత్ర ఫస్ట్​లుక్​ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్​లో కనిపించిన కృతిశెట్టి(krithi shetty).. ఆకట్టుకుంటోంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయం ఆసక్తి కలిగిస్తోంది.

ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్​ కోసం 'జాతిరత్నాలు' ఫేమ్​ ఫరియా అబ్దుల్లా(Faria Abdullah)ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె.. నాగ్ సర్​కు ప్రత్యేకమైన స్వాగ్ ఉంటుందని, ఆయనతో డ్యాన్స్​ చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని వెల్లడించింది. 

Also Read: కృతిశెట్టి లుక్‌ షేర్‌ చేసిన నాగచైతన్య, నాగార్జునకు..చై కౌంటర్

'సోగ్గాడే చిన్ని నాయనా'కు ఈ సినిమా ప్రీక్వెల్​గా తెరకెక్కుతోంది బంగార్రాజు(Bangarraju Movie). ఇందులో నాగార్జున, రమ్యకృష్ణతో పాటు నాగచైతన్య(Naga chaitanya), కృతిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తొలి భాగాన్ని తెరకెక్కించిన కల్యాణ్​కృష్ణ కురసాల.. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. 
అయితే 'బంగార్రాజు'ను సంక్రాంతి రేసులో నిలబెట్టాలని చిత్రబృందం భావిస్తోంది. కానీ 'ఆర్ఆర్ఆర్', 'భీమ్లా నాయక్', 'రాధేశ్యామ్' లాంటి భారీ సినిమాలు ఇప్పటికే బరిలో ఉన్న నేపథ్యంలో.. 'బంగార్రాజు'కు ప్లేస్ దొరుకుతుందా అనేది చూడాలి. మరో వైపు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగ్.. పక్కా యాక్షన్ మూవీ ఘోస్ట్‌లోనూ హీరోగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయన రా ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News