Vishwak Sen Prank: నడిరోడ్డుపై విశ్వక్‌ సేన్‌ రచ్చ.. సినిమా ప్రొమోషన్ కోసం ఇంత అరాచకమా!

Fan suicide prank on Vishwak Sen. తాజాగా 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమా ప్రమోషన్ కోసం హీరో విశ్వక్‌ సేన్‌ చేసిన ఓ ప్రాంక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 2, 2022, 09:32 AM IST
  • నడిరోడ్డుపై విశ్వక్‌ సేన్‌ రచ్చ
  • సినిమా ప్రొమోషన్ కోసం ఇంత అరాచకమా
  • ప్రాంక్‌ పేరుతో విశ్వక్‌ సేన్‌ నానారచ్చ
Vishwak Sen Prank: నడిరోడ్డుపై విశ్వక్‌ సేన్‌ రచ్చ.. సినిమా ప్రొమోషన్ కోసం ఇంత అరాచకమా!

Fan suicide prank on Hero Vishwak Sen for AVAK Movie promotions: గత కొంత కాలంగా ప్రాంక్‌ల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ప్రాంక్‌లు బాగా పాపులర్ కావడం, వ్యూస్ కూడా వస్తుండంతో.. అవి చేసేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేడకుండా ప్రతిఒక్కరు కెమెరా ముందు రెచ్చిపోతున్నారు. దర్శకనిర్మాతలు, హీరోలు సైతం తమ సినిమాల ప్రమోషన్ కోసం ప్రాంక్‌ల వైపు వెళుతున్నారు. తాజాగా 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమా ప్రమోషన్ కోసం చేసిన ఓ ప్రాంక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

యువ హీరో విశ్వక్‌ సేన్‌ నటించిన తాజా సినిమా 'అశోక వనంలో అర్జున కళ్యాణం'. విద్యా సాగర్‌ చింత దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 6న విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ స్పీడు పెంచింది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ అండదండలతో ఒకతను రోడ్డుపై ప్రాంక్‌ చేశాడు. దాంతో ఫిలింన‌గ‌ర్ రోడ్డులో వాహన దారులు తెగ ఇబ్బంది పడ్డారు. 

హీరో విశ్వ‌క్ సేన్ ఫిలింన‌గ‌ర్ రోడ్డులో కారులో వెళుతుంటే.. ఓ యువ‌కుడు కారుకు అడ్డంగా వచ్చి నడి రోడ్డుపై పడుకున్నాడు. విశ్వ‌క్ సేన్ కారు దిగి ఇదేంటి అని అడగ్గా.. నాకు అర్జున్ కుమార్ అల్లం కావాలి, ఎక్కడ ఉన్నాడు అంటాడు. బ్రో నేనే అని విశ్వ‌క్ సేన్ అనగా.. నువ్ విశ్వ‌క్ సేన్, నాకు అర్జున్ కుమార్ కావాలి అంటాడు. ఎవరు ఎంత చెప్పినా అతడు వినడు. చివరకు 'అల్లం అర్జున్ కుమార్‌కి 33 ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదు. నేను అసలు తట్టుకోలేకపోతున్నా. రెండు తెలుగు రాష్ట్రాల అమ్మాయిలు మా ఓడిని పెళ్లి చేసుకోకుంటే.. పెట్రోల్‌ పోసుకొని సూసైడ్‌ చేసుకుంటా' అని అంటాడు. దాంతో విశ్వ‌క్ సేన్ అతడిని తన కారులో ఎక్కించి.. ఆటోలో వెళ్లిపోతాడు. 

ప్రస్తుతం విశ్వ‌క్ సేన్‌కు సంబందించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వీడియో చుసిన వారు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సినిమా ప్రొమోషన్ కోసం ఇంత అరాచకమా?,  ప్రాంక్‌ పేరుతో పబ్లిక్‌ ప్లేస్‌లో న్యూసెన్స్‌ చేయడం ఏంటి, ఇది చాలా ఎక్కువ గురూ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రుష్క‌ర్ ధిల్లాన్ నటించారు. జై క్రిష్‌ సంగీతం అందించిన పాటలకు మంచి స్పందన లభించింది.  

Also Read: Prabhas Project K: ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' షూట్ రీస్టార్ట్... రెబల్ స్టార్‌పై కీలక సన్నివేశాల చిత్రీకరణ...

Also Read: Ruturaj Gaikwad Record: బ్లాస్టింగ్ ఇన్నింగ్స్‌తో సచిన్ రికార్డును సమం చేసిన రుతురాజ్ గైక్వాడ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News