Vijay Devarakonda: కార్తీతో కలిసి విజయ్ దేవరకొండ డాన్స్.. వీడియో వైరల్

Karthi: ఇద్దరు స్టార్ హీరోలు ఒకే స్టేజిపై కనిపిస్తే.. ఇక అభిమానుల ఉత్సాహం ప్రత్యేకంగా చెప్పాలా? ఇప్పుడు అలాంటి సంగతనే చోటుచేసుకుంది. ఒకే స్టేజిపై టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కోలీవుడ్ సూపర్ హీరో కార్తీ కలిసి డాన్స్ వేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 30, 2024, 06:06 PM IST
Vijay Devarakonda: కార్తీతో కలిసి విజయ్ దేవరకొండ డాన్స్.. వీడియో వైరల్

Vijay Devarakonda Viral Video
తెలుగు ప్రేక్షకుల మదిలో విజయ్ దేవరకొండ కి, కార్తీకి ప్రత్యేక స్థానం ఉంది. కార్తీ పేరుకి తమిళ హీరో అయినా తెలుగువారు తమ సొంత హీరోలా భావిస్తారు. ఇక మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ కి తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న పాపులారిటి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి ఈ ఇద్దరు హీరోలు కలిసి తాజాగా వేసిన డాన్స్ వీడియో తెగ వైరల్ అవుతుంది.

నిన్న రాత్రి చెన్నైలో గలాటా గోల్డెన్ స్టార్ అవార్డ్స్ వేడుక ఘనంగా జరిగింది. ఈ అవార్డు వేడుకకు ఎంతోమంది సెలబ్రిటీస్ హాజరయ్యారు. తెలుగు, తమిళ్, వేరే భాషల సినీ ప్రముఖులు అందరూ ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ కూడా ఏప్రిల్ 5న విడుదల కాబోతున్న ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్ లో భాగంగా హాజరయ్యాడు. కాగా ఈ ఈవెంట్ లో కార్తీకి అవార్డు రాగా.. స్టేజిపై కార్తీకి అవార్డు అందించడానికి విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వచ్చారు. అవార్డు తీసుకున్న తరువాత కార్తీ, విజయ్ ని స్టెప్పులు వెయ్యమని అక్కడ ఉన్నవారు.. రిక్వెస్ట్ చేయడంతో ఈ ఇద్దరు హీరోలు  కార్తీ తమిళ్ సాంగ్స్ కి స్టెప్పులు వేశారు.

 

ప్రస్తుతం ఈ ఇద్దరు యంగ్ హీరోలు కలిసి వేసిన ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కార్తీ, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తమ హీరోలు ఇలా స్టేజిపై డ్యాన్స్ వేస్తుంటే సంతోషం వ్యక్తం చేస్తూ ఆ డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తున్నారు.

Also Read: Nikhil Siddhartha TDP: హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ సంచలనం.. అనూహ్యంగా టీడీపీలో చేరిక

Also Read: KTR Fire: కేకే, కడియం వంటి వాళ్లు మళ్లీ వచ్చి కేసీఆర్‌ కాళ్లు పట్టుకున్నా తిరిగి రానివ్వం: కేటీఆర్‌

 

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News