"పద్మావతి" సిన్మా రిలీజ్‌పై ఆందోళన

  

Last Updated : Nov 9, 2017, 05:22 PM IST
"పద్మావతి" సిన్మా రిలీజ్‌పై ఆందోళన

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన "పద్మావతి" సినిమా హైదరాబాద్‌లో విడుదల చేస్తే ఊరుకొనేది లేదని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు.  వీలైతే ఆందోళన కూడా చేస్తామని ప్రకటించారు.  రాజస్థానీ సమాఖ్య సమావేశంలో మాట్లాడిన ఆయన, ఈ సినిమాని ప్రభుత్వం బహిష్కరించాలని డిమాండ్ చేశారు. బన్సాలీ తీసిన ఈ చిత్రంలో ఇసుమంతైనా నిజం లేదని.. కేవలమిది కట్టుకథ అని చెప్పారు. హిందూ యువతి పద్మావతి, అల్లావుద్దీన్ ఖిల్జీల మధ్య ప్రేమ సన్నివేశాలు చిత్రీకరించడానికి దర్శకుడికే ఎంత ధైర్యమని.. ఈ చిత్రాన్ని తప్పకుండా తాము అడ్డుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమాకు వ్యతిరేకంగా జైపూర్‌లో కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నవంబరు 10న ఈ చిత్రాన్ని బహిష్కరించడానికి భారీ ర్యాలీ నిర్వహించాలని  భజరంగదళ్ పిలుపునిచ్చింది. అలాగే రాజస్థాన్‌లోని రాజ్ పుత్ సంఘాలు కూడా ఈ చిత్రంపై వ్యతిరేకతను చూపిస్తున్నాయి. 

Trending News