Dr Haranath Policherla Receives Award: చలనచిత్ర నటుడు, నిర్మాత డా. హరనాథ్ పోలిచెర్లకు విశిష్ట గౌరవం లభించింది. లోకనాయక్ ఫౌండేషన్ వారు ఆయనకు జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేసి సత్కరించారు. ఈ వేడుక విశాఖపట్నంలో జరిగిన ఎన్టీఆర్ 29వ వర్థంతి, ఎఎన్ఆర్ శతజయంతి ముగింపు ఉత్సవాల సందర్భంగా ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, ప్రముఖ నటుడు బ్రహ్మానందం, నిర్మాతలు అశ్వనీదత్, వైవీఎస్ చౌదరి, సాహితీవేత్త అందెశ్రీ, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా అతిథులు డా. హరనాథ్ పోలిచెర్లకు పురస్కారం అందించి.. ఆయన సేవలను కొనియాడారు.
డా. హరనాథ్ పోలిచెర్ల వైద్య రంగంలోనే కాదు, సినీ రంగంలో కూడా తనదైన ప్రతిభతో సేవలందిస్తున్నారు. ఆయన నిర్మాతగా రామానాయుడు కీలక పాత్రలో నటించిన 'హోఫ్' చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ నటించిన 'చంద్రహాస్'ను నిర్మించారు. నిర్మాతగా మాత్రమే కాకుండా, హీరోగా కూడా ఎన్నో చిత్రాలలో తన ప్రతిభ చూపించారు. 'అలెక్స్', 'చాప్టర్ 6', 'బీఎఫ్ఎఫ్', 'కెప్టెన్ రానా ప్రతాప్', 'డ్రిల్' వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు.
ప్రస్తుతం డా. హరనాథ్ పోలిచెర్ల 'నా తెలుగోడు' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడెమీ కాస్టింగ్, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ బాధ్యతలు నిర్వహిస్తోంది. ఈ ప్రత్యేక గౌరవం పొందిన సందర్భంగా డా. హరనాథ్ పోలిచెర్ల సంతోషం వ్యక్తం చేస్తూ, లోకనాయక్ ఫౌండేషన్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. సినీ రంగం నుంచి పలు ప్రముఖులు ఆయనను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
డా. హరనాథ్ పోలిచెర్ల సేవలు మరియు ప్రతిభకు ఈ జీవన సాఫల్య పురస్కారం ఒక గుర్తింపు. తెలుగు సినిమా రంగంలో ఆయన చేసిన సేవలు, పెట్టుబడులు పరిశ్రమ అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డాయి.
Also Read: Retirement Age Increase: ప్రభుత్వ ఉద్యోగులకు 'కొత్త టెన్షన్'.. రిటైర్మెంట్ వయస్సు 65 ఏళ్లకు పెంపు?
Also Read: K Kavitha: 'రేవంత్ రెడ్డికి ఏటీఎంలా మూసీ ప్రాజెక్టు.. ఢిల్లీకి డబ్బుల మూటలు తరలించే కుట్ర
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter