Surya Kiran Eliminated: బిగ్ బాస్ 4 తొలి ఎలిమినేషన్ ముందే ఊహించారు!

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 తొలి వారం టాలీవుడ్ దర్శకుడు సూర్యకిరణ్ ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి (Surya Kiran Eliminated From Bigg Boss 4) వెళ్లిపోయారు. అయితే బిగ్ బాస్ సీజన్ 4 రెగ్యూలర్‌గా చూస్తున్న ప్రేక్షకులు కచ్చితంగా ఈ ఎలిమినేషన్‌ను ఊహించి ఉంటారు.

Last Updated : Sep 14, 2020, 12:24 PM IST
  • బిగ్ బాస్ సీజన్ 4 తొలి ఎమినేషన్ డైరెక్టర్ సూర్యకిరణ్
  • ఆయన వెళ్లిపోతారని బిగ్ బాస్ ప్రేక్షకులు ముందే ఊహించారు
  • ఓట్లు వేసిన బిగ్ బాస్ ప్రేక్షకుల అంచనా నిజమైంది
  • ఎలిమినేషన్‌లో మిగతా కంటెస్టెంట్స్ గురించి బాగా చెప్పాడు
Surya Kiran Eliminated: బిగ్ బాస్ 4 తొలి ఎలిమినేషన్ ముందే ఊహించారు!

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ 4లో ఎలిమినేషన్స్ మొదలయ్యాయి. తొలి వారం టాలీవుడ్ దర్శకుడు సూర్యకిరణ్ ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి వెళ్లిపోయారు. అయితే బిగ్ బాస్ సీజన్ 4 రెగ్యూలర్‌గా చూస్తున్న ప్రేక్షకులు కచ్చితంగా ఈ ఎలిమినేషన్‌ను ఊహించి ఉంటారు. సూర్యకిరణ్ బిగ్ బాస్ హౌస్‌లో బాండింగ్ ఏర్పరచుకోకపోవడం, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నాడో మిగతా కంటెస్టెంట్స్‌కు అంతగా అర్థం కాలేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న వ్యక్తి అవకపోవడం ఆయనకు మరో మైనస్ పాయింట్ అయింది. Goddeti Madhavi: మరో ఇద్దరు వైఎస్సార్‌సీపీ ఎంపీలకు కరోనా పాజిటివ్

మరోవైపు నామినేషన్స్‌లో ఉన్న మిగతా కంటెస్టెంట్స్‌కు వారికంటూ ప్రత్యేకమైన ఫాలోయర్లు ఉన్నారు. అయితే దర్శకుడు సూర్యకిరణ్ ప్రస్తుతం టాలీవుడ్‌తో అంత సంబంధాలు లేకపోవడం మైనస్ ఓ పాయింట్ కాగా, ఎక్కడ వివాదం జరుగుతున్నా అక్కడ సూర్యకిరణ్ ఎంటర్ అవడం మైనస్ పాయింట్. ముఖ్యంగా ప్రేక్షకులు ఫెవరిటిజమ్‌ను చూపించడం సైతం సూర్యకిరణ్ ఎలిమినేషన్‌కు ఓ కారణంగా చెప్పవచ్చు.. Bigg Boss Telugu Voting: బిగ్ బాస్ ఓటింగ్.. రెండు రకాలుగా ఓట్లు వేయవచ్చు 

కంటెస్టెంట్స్ అభిజిత్, సూర్యకిరణ్, అఖిల్ సార్ధక్, దివి, మెహబూబ్, సుజాత, గంగవ్వ తొలి వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. వీరిలో అభిజిత్, అఖిల్, దివి, మెహబూబ్‌, సుజాతలకు ఫాలోయర్లు ఉన్నారు. వీరు ప్రస్తుతం తమ ఫీల్డ్‌లో యాక్టివ్‌గా ఉన్నారు. సూర్యకిరణ్‌ను గమనిస్తే.. సరైన ప్లానింగ్ లేకపోవడంతో పాటు మనసులో ఉన్నది కచ్చితంగా బయటకు చెప్పడమే ఆయనకు మైనస్ అయింది. మరో కంటెస్టెంట్ దేవి సైతం ఈ విషయాన్ని ప్రస్తావించడం తెలిసిందే. Rains In Telangana: తెలంగాణలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు

చివరగా బిగ్ బాస్ 4 హోస్ట్ నాగార్జున ఇచ్చిన టాస్కులో కంటెస్టెంట్స్ స్వభావాలను జంతువులతో చాలా బాగా వివరించారు. మొనాల్ గజ్జర్ నెమలి అని, గంగవ్వ చీమ, అమ్మ రాజశేఖర్ సింహమని, లాస్య గాడిద (భారం మోస్తుంది. ప్రస్తుతం కెప్టెన్ కనుక అని వివరణ), నోయల్ నక్క అని జిత్తులు బాగానే వేస్తాడని, అభిజిత్ పిల్లి అని ఎక్కడ వరకు ఉండాలి, ఎలా ఉండాలో డైలమాలో ఉన్నాడంటూ డైరెక్టర్ సూర్యకిరణ్ బిగ్ బాస్ 4 ఎలిమినేషన్ సందర్భంగా ఇచ్చిన వివరణ మాత్రం బిగ్ బాస్ 4 ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సూర్య కిరణ్ వివరణను సభ్యులు సైతం ఏ ఇబ్బంది లేకుండా ఎంజాయ్ చేశారు. 

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News