Ravi Teja: రవితేజ కి పర్ఫెక్ట్ టైటిల్…మరోసారి హరిష్ శంకర్ దర్శకత్వంలో హిట్ షురూ

Mister Bachan: రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాపై అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. కాదా ఈ సినిమాకి ఈరోజు శ్రీకారం చుట్టి టైటిల్ ప్రకటించేశారు ఈ చిత్ర మేకర్స్… 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2023, 01:55 PM IST
Ravi Teja: రవితేజ కి పర్ఫెక్ట్ టైటిల్…మరోసారి హరిష్ శంకర్ దర్శకత్వంలో హిట్ షురూ

Ravi Teja Mister Bachan: మాస్ మహరాజా రవితేజ కి ఈమధ్య టైం అంతగా బాగాలేదు. వరస ప్లాపులతో సతమతమవుతున్నారు ఈ హీరో. దీంతో రవితేజ ప్రస్తుతం తన ఆశలన్నీ రాబోయే సినిమా ఈగల్ పైన పెట్టుకున్నారు. అయితే రవితేజ అభిమానులు మాత్రం ఈగల్ సినిమా కన్నా ఎక్కువ ఆ తరువాత రవితేజ నుంచి రాబోయే ప్రాజెక్ట్ పైన పెట్టుకుంటున్నారు. ఇందుకు ముఖ్య కారణం ఈ మధ్యనే రవితేజ హరీష్ శంకర్ తో సినిమా ప్రకటించడం.

రవితేజ కి మిరపకాయ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ మరోసారి ఆ దర్శకుడితోనే సినిమా ప్రకటించడంతో అంచనాలు భారీగా పెరిగాయి. హరి శంకర్ సినిమా ఇండస్ట్రీకి అడుగుపెట్టింది కూడా రవితేజ సినిమా షాక్ తోనే. అయితే ఆ సినిమా మాత్రం డిజాస్టర్ గా మిగలగా మిరపకాయ చిత్రం సూపర్ హిట్ సొంతం చేసుకుంది.

ఇక రవితేజ తన తదుపరి సినిమా ‘ఈగల్’ విడుదలకు సిద్ధమవుతుంటే మరోవైపు డైరెక్టర్ హరీష్ శంకర్‌తో కొత్త సినిమా మొదలుపెట్టేసారు. కాగా ఈ చిత్రం టైటిల్ని ఈరోజు ప్రకటించారు ఈ సినిమా యూనిట్.  వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమాకు ‘మిస్టర్ బచ్చన్’ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. ఈ మిస్టర్ బచ్చన్ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను కూడా ఈరోజు నిర్వహించారు. 

కాగా రవితేజని మొదటి నుంచి అమితాబ్ బచ్చన్ తో మన తెలుగువారు పోల్చే విషయం మనకు తెలిసిందే. రవితేజ యాక్షన్ లో డాన్స్ లో ఎక్కువగా అమితాబ్ బచ్చన్ ని ఇమిటేజ్ చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో మనం మాస్ మహారాజా కు ఏకంగా మిస్టర్ బచ్చన్ అని టైటిల్ పెట్టడంతో.. అభిమానులు ఈసారి రవితేజ కి సూపర్ హిట్ షురూ అని సంబరపడిపోతున్నారు.

ఇక ఈరోజు పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుండి. ఇక ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు.  పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

Also Read: Bank Alerts: డిసెంబర్ 31లోగా బ్యాంకుకు వెళ్లి ఈ పని పూర్తి చేయకుంటే ఇబ్బందులు తప్పవు

Also Read: KCR Discharge: కోలుకున్న కేసీఆర్, యశోద ఆసుపత్రి నుంచి ఇంటికి డిశ్చార్జ్

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News