Dil Raju Varisu Telugu Release : తమిళ సినిమాలు, తెలుగు సినిమాల మధ్య ఎప్పుడూ కోల్ట్ వార్ జరుగుతూనే ఉంటుంది. తెలుగు మార్కెట్ వ్యాల్యూ తెలిసే తమిళ డబ్బింగ్ సినిమాలను ఎక్కువగా రిలీజ్ చేస్తుంటారు. ఇక్కడి జనాలు కంటెంట్ నచ్చితే ఏ భాష సినిమాలనైనా బ్లాక్ బస్టర్ హిట్లను చేస్తుంటారు. అందుకే ఎక్కువగా తెలుగులోకి డబ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. సంక్రాంతి సీజన్‌కు తమిళ డబ్బింగ్ సినిమాల వివాదాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి.
2019లో రజినీకాంత్ పేట్టా సినిమా డబ్బింగ్ సినిమా అని, దానికి థియేటర్లు ఎలా ఇస్తారు.. ముందు తెలుగు సినిమాలకు మాత్రమే థియేటర్లు ఇవ్వాలని నిర్మాత దిల్ రాజు అన్నాడు. ఇప్పుడు అదే దిల్ రాజు తన డబ్బింగ్ సినిమాకు థియేటర్లు ఎక్కువగా కేటాయించుకున్నాడని, తెలుగు సినిమాలను పట్టించుకోవడం లేదని ఓ వర్గం వాదన. దీనిపై రకరకాల చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
దీనిపై దిల్ రాజు తాజాగా స్పందించాడు. వారిసు సినిమాను ప్రారంభించిన సమయంలోనే తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తామని చెప్పామని గుర్తు చేశాడు. బాలయ్య సినిమా డిసెంబర్లో రావాల్సింది.. కానీ సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు.. మైత్రీ నిర్మించిన రెండు సినిమాలు సంక్రాంతికే వస్తున్నాయి.. 75 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఇలా సంక్రాంతికి ఒకే సంస్థ నిర్మించిన రెండు సినిమాలు రావడం మొదటి సారి.. వాళ్లకే లేని బాధ వేరే వాళ్లకి ఎందుకు అన్నట్టుగా దిల్ రాజు కౌంటర్లు వేశాడు.
పేట్టా సినిమాను చివరి నిమిషంలో కొనేసి.. సంక్రాంతికి అనౌన్స్ చేశారు.. అందుకే అలా ఆరోజు అనాల్సి వచ్చింది.. అంటూ నాటి విషయాన్ని కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు దిల్ రాజు.
Also Read : Ali Daughter Fatima Marriage : కమెడియన్ అలీ కూతురు వివాహాం.. చిరు, రోజా, నాగ్ సందడి
Also Read : Pragya Jaiwal Sizzling Photos: వింత డ్రెస్సులో ప్రగ్యా జైస్వాల్ హాట్ ట్రీట్.. డోంట్ మిస్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook