Dheera Pre-release Event లక్ష చదలవాడా హీరోగా రాబోతున్న సినిమా ధీర. ఈ చిత్రం ఈ వారం విడుదలవుతున్న సందర్భంగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు చిత్రమేకర్స్. విక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ మీద పద్మావతి చదలవాడ నిర్మించారు. ఫిబ్రవరి 2న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇక ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దిల్ రాజు, గోపీచంద్ మలినేని, త్రినాథరావు నక్కిన సినిమా బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు.
ముందుగా ఈ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ..” పాతిక సంవత్సరాల నుంచి చదలవాద బ్రదర్స్ ని చూస్తూనే ఉన్నాం. వారు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న టైంలోనే నేను డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించాను. నాని దసరా సినిమాను వాళ్లు కొన్నారని తెలిసి వారిని కలవడం జరిగింది. ఆ తరువాత మేం వ్యక్తిగతంగా ఎంతో దగ్గరయ్యాం. శ్రీనివాస్ గారు ఎంతో మంది చిన్న నిర్మాతలకు సాయం చేశారు. ఫిలిం చాంబర్ ఎలెక్షన్స్‌లోనూ నేను అధ్యక్షుడిగా ఉండాలని నా కోసం ఎంతో సాయం చేశారు. లక్ష్ నటించిన ధీర ట్రైలర్ చూశాను. ఈ సినిమా ఫిబ్రవరి 2న రాబోతోంది. ప్రేక్షకులు ఈ సినిమాను విజయవంతం చేయాలి. అందరికీ ఆల్ ది బెస్ట్’ అని తెలియజేశారు.
నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘నేను ఇన్ని సంవత్సరాల నా కెరియర్ లో ఏ హీరోని కూడా డేట్స్ అడగలేదు. ఎంతో మంది దర్శకులని నేను పరిచయం చేశాను. ధీర సినిమాతో డైరెక్టర్ విక్రాంత్‌ను పరిచయం చేస్తున్నాను. దర్శకుడు పడ్డ కష్టాన్ని నేను చూశాను. తప్పకుండా ఆయన కష్టానికి ఫలితం రావాలి. ఫిబ్రవరి 2న ధీర చిత్రం రాబోతోంది. మార్చిలో నేను వంద కోట్లతో తీసిన రికార్డ్ బ్రేక్ అనే గ్రాఫిక్స్ చిత్రం రాబోతోంది. ఆ సంవత్సరం దాదాపు 5 సంవత్సరాల నుంచి తీస్తున్నాము. అది ప్యాన్ వరల్డ్ సినిమా. మా ప్రొడక్షన్స్‌లో ఇప్పుడు దాదాపు పదహారు చిత్రాలు రెడీగా ఉన్నాయి. దిల్ రాజు గారిని ఛాంబర్ అధ్యక్షుడిగా చేయడంలో నా వంతు సాయం చేశాను. ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీని ఒక త్రాటిపైకి తీసుకు రావాలని అనుకుంటూనే ఉన్నాను. మున్ముందు చిత్ర పరిశ్రమ మరింత ఎత్తుకు వెళ్తుంది’ అని చెప్పుకొచ్చారు.
ఇక ఈ సినిమా హీరో లక్ష్ చదలవాడ మాట్లాడుతూ..‘సినిమా కథ గురించి ప్రస్తుతం నేను చెప్పలేను. అయితే నా కారెక్టరైజేషన్ గురించి మాట్లాడతాను. సినిమాలోని పాత్ర, రియల్ లైఫ్‌లోని నా కారెక్టర్‌కు ఏ మాత్రం సంబంధం ఉండదు. పక్కనోడి గురించి పట్టించుకోకుండా నచ్చింది చేస్తుంటాడు. అలాంటి వాడికి ఓ మిషన్ ఇస్తే.. ఆ ప్రయాణంలో ఏర్పడిన సమస్యలు ఏమిటి అనేది ఈ సినిమాలో చూపించబోతున్నాం. నా లుక్ బాగుంది. నన్ను బాగా చూపించారు. నెపోటిజం, బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్లకి చాలా కష్టం. మా మీద అంచనాలుంటాయి. బయటకు వెళ్తే అవకాశాలు రావు. మీ నాన్న గారు ఉన్నారు కదా? అని చాలామంది అంటూ ఉంటారు. నేను కూడా ఆఫీస్‌ల చుట్టూ చాలాసార్లు తిరిగాను. మాక్కూడా అవకాశాలు రావడం కష్టమే. నాకు సపోర్ట్ చేసిన టీంకు థాంక్స్. ఫిబ్రవరి 2న మా సినిమా వస్తోంది. మేం ఎంత చేసినా ఆడియెన్స్‌కు నచ్చకపోతే వృథా. మీకు సినిమా నచ్చితే.. ఇంకా కష్టపడి సినిమాలు చేస్తాం. మేం నిజాయితీగా ఈ సినిమాను తీశాం. మా నాన్న గారు లేకపోతే అసలు నేను లేను. ఆయన వన్ మెన్ ఆర్మీ. థాంక్స్ డాడీ.. మీ వల్లే మేం ఉన్నాం' అని చెప్పుకొచ్చారు.
ఆ తరువాత దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ..’శ్రీనివాస్ గారి బ్యానర్‌లో వచ్చిన పోలీస్ సినిమాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను. లక్ష్ నాకు ఫ్రెండ్. ఏ సినిమా వచ్చినా ఫస్ట్ డే ఫస్ట్ షోకు వస్తాడు. మిడ్ నైట్ షోలు కూడా చూస్తాం. తన కటౌట్‌ను సరిగ్గా వాడుకున్నారని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాకి అందరూ కష్టపడిన దానికి తగిన ఫలితం రావాలి’ అని అన్నారు.
Also Read: Konda Surekha: జగన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ అక్క.. ఏపీ రాజకీయాల్లోకి కొండా సురేఖ
Also Read: Telangana High Court: తెలంగాణలో అనూహ్య మలుపు.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారానికి బ్రేక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి