Chaithanya Master Suicide : ఢీ కొరియోగ్రఫర్ మృతి.. ఆ కారణాలతోనే సూసైడ్

Chaithanya Master Suicide ఢీ షోలో చైతన్య మాస్టర్ ఇప్పుడు బాగానే ట్రెండింగ్‌లోకి వచ్చాడు. అయితే ఇప్పుడు ఆయన ఆర్థిక పరమైన సమస్యలతో సతమతమవుతున్నాడు. అందుకే సూసైడ్ చేసుకుంటున్నాను అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 30, 2023, 08:21 PM IST
  • టాలీవుడ్‌లో మరో విషాదం
  • డ్యాన్స్ కొరియోగ్రఫర్ సూసైడ్
  • చైతన్య మాస్టర్ మృతి
Chaithanya Master Suicide : ఢీ కొరియోగ్రఫర్ మృతి.. ఆ కారణాలతోనే సూసైడ్

Chaithanya Master Suicide బుల్లితెరపై వచ్చే ఢీ షో గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు నడుస్తున్న సీజన్‌లో చైతన్య మాస్టర్ బాగానే ఫేమస్ అయ్యాడు. అంతా బాగానే ఉందని అనుకుంటున్న సమయంలోనే చైతన్య మాస్టర్ అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన మరణ వార్త తెలియన అభిమానులు తీవ్రంగా దుఃఖిస్తున్నారు. 

నెల్లూరులో ఆయన సూసైడ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అక్కడి  క్లబ్ హోటల్‌లో ఆత్మహత్య చేసుకున్నట్టుగా సమాచారం. ఆర్థికపరమైన సమస్యల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆత్మహత్యకు ముందు  ఆయన ఓ సెల్ఫీ వీడియోను రికార్డ్ చేయడంతో అసలు విషయం అందరికీ తెలిసి వచ్చింది.

తాను ఈ పని చేస్తున్నందుకు తల్లిదండ్రులకు, తన తోటి డ్యాన్స్ మాస్టర్లకు, డ్యాన్సర్లకు సారీ చెప్పుకొచ్చాడు. అప్పులు ఇచ్చినవాళ్లు ఇచ్చిన ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాని.. చాలా ట్రై చేసినా అవ్వడం లేదని తన బాధనంతా వెల్లగక్కాడు. ఒక అప్పును పూడ్చుకునేందుకు.. మరో అప్పు.. అలా అప్పులు పెరిగిపోయాయని తన ఆర్థిక పరమైన ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చాడు.

Also Read: Anchor Manjusha : అందమంతా మంజూష దగ్గరే ఉన్నట్టుందే.. ఆహా అనిపించేలా యాంకర్.. పిక్స్ వైరల్

తనకు ఇంతటి పేరు, గుర్తింపును ఇచ్చిన ఢీ షోకు ఎప్పుడూ రుణపడి ఉంటానని ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఇక ఆ వీడియోలో మల్లెమాల వ్యవహారం మీద కూడా స్పందించాడు. ఢీలో పేరు వచ్చింది గానీ సంపాదన అంతంతమాత్రంగానే ఉంటుందని, అయితే అదే సమయంలో జబర్దస్త్ షోలో ఎక్కువ డబ్బు ఇస్తారని అందులో చెప్పుకొచ్చాడు. ఈ సూసైడ్ కేసులో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం అతని కుటుంబ సభ్యలకు సమాచారం అందించారు. ఈ సూసైడ్ కేసును నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Also Read:  Rajamouli : ఎంత ప్రయత్నించినా లోపలకు వెళ్లనివ్వలేదు.. నాటి ఘటనపై నోరువిప్పిన రాజమౌళి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News