Dhanush: హీరో ధనుష్‌కు బ్రిక్స్ అవార్డు...'అసురన్'లో నటనకు గానూ...

Dhanush: తమిళ స్టార్‌ హీరో ధనుష్‌కు బ్రిక్స్‌ పురస్కారం వరించింది. బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో 'అసురన్' చిత్రానికి ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నాడు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 29, 2021, 03:19 PM IST
Dhanush: హీరో ధనుష్‌కు బ్రిక్స్ అవార్డు...'అసురన్'లో నటనకు గానూ...

Dhanush: గోవాలో జరిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI) వేడుకలు నిన్నటితో ముగిశాయి. తమిళ చిత్రం 'అసురన్‌'లో అద్భుతంగా నటించి..మెప్పించిన హీరో ధనుష్(Hero Dhanush)కు బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్(BRICS Film Festival)లో ఉత్తమ నటుడి(Best Actor)గా అవార్డు దక్కింది. ఇదే చిత్రానికి ఈ ఏడాది ధనుష్ జాతీయ అవార్డు అందుకోవడం విశేషం. బ్రిక్స్ ఫెస్టివల్‌లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాకు చెందిన సినిమాలు పాల్గొన్నాయి.

బ్రెజిలియన్ చిత్రం '‘ఆన్ వీల్స్’'లో నటనకు గాను లారా బోల్డోరిని(Lara Boldorini) ఉత్తమ నటిగా అవార్డును అందుకుంది. ఉత్తమ చిత్రం అవార్డును దక్షిణాఫ్రికా చిత్రం 'బరకత్' మరియు రష్యన్ చిత్రం 'ది సన్ అబౌ మీ నెవర్ సెట్స్' సంయుక్తంగా పంచుకున్నాయి. ‘బరకత్’ చిత్రానికి అమీ జెఫ్తా దర్శకత్వం వహించగా, రష్యన్ చిత్రానికి లియుబోవ్ బోరిసోవా దర్శకత్వం వహించారు. ఇఫితో పాటు బ్రిక్స ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించడం ఇదే తొలిసారి.

Also Read: Jennifer Lawrence: నా నగ్న శరీరాన్ని ఎవరైనా చూడొచ‍్చు.. బంపర్ ఆఫర్ ఇచ్చిన హాలీవుడ్‌ నటి!

సమాజంలోని అసమానతలు, అంటరానితనాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన సినిమా 'అసురన్'(Asuran Movie). ఇందులో తన పాత్రకు నూరుశాతం న్యాయం చేశారు హీరో ధనుష్. ఈ సినిమాకు వెట్రిమారన్ దర్శకత్వం వహించగా,,కలైపులి ఎస్ థాను నిర్మించారు. ఈ చిత్రంలో మంజువారియర్ కీలకపాత్ర పోషించారు. జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఏకంగా 3అవార్డులు సొంతం చేసుకుంది. అంతేకాదు 78 వ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌(Golden Globe Awards)లో ‘ఉత్తమ విదేశీ చిత్రం’ కేటగిరీ కింద ఈ సినిమాను ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని 'నారప్ప'గా తెలుగులో వెంకటేశ్ చేశారు. 

Also Read:ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా భట్ పారితోషికం తెలిస్తే..నోరెళ్లబెట్టాల్సిందే

ఈ అవార్డుపై ట్విట్టర్ వేదికగా స్పందించారు ధనుష్(Dhanush Tweet). '‘నాకు ఇది ఒక పరిపూర్ణ గౌరవం' అని ట్వీట్ లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ధనుష్... ‘మారన్‌’, ‘తిరుచిత్రంబళం’ సినిమాలు చేస్తున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News