Ramam Raghavam: "రామం రాఘవం" ఫస్ట్ లుక్ విడుదల… ధనరాజ్ నటిస్తూ దర్శకత్వం లో రానున్న సముద్రఖని

Ramam Raghavam First Look: జబర్దస్త్ ప్రోగ్రాం తో బాగా పాపులారిటీ సంపాదించుకున్న హాస్యనటుడు ధనరాజ్.  ఇప్పటికే జబర్దస్త్ వేణు బలగం సినిమా తీసి సూపర్ హిట్ అందుకోగా ఇప్పుడు ధనరాజ్ కూడా అదే దారిలో ప్రయాణించబోతున్నాడు..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 23, 2024, 01:19 PM IST
Ramam Raghavam: "రామం రాఘవం" ఫస్ట్ లుక్ విడుదల… ధనరాజ్ నటిస్తూ దర్శకత్వం లో రానున్న సముద్రఖని

Dhanraj: ధనరాజ్ దర్శకత్వంలో.. ప్రముఖ నటుడు సముద్రఖని నటిస్తున్న సినిమా రామ రాఘవం. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మాణం లో  ప్రొడక్షన్ నెంబర్ 1 గా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. కాగా ఈ ద్విభాష చిత్రానికి "రామం రాఘవం" టైటిల్ ను ఖరారు చేశారు. జనవరి 22న అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ ను ఇరవై రెండు మంది సినీ ప్రముఖుల చేతుల మీదుగా విడుదల చేసి చిత్రం పెద్ద సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేసి అభినందనలు తెలియజేశారు.. 

ధనరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ధనరాజ్ కూడా ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. ఈరోజు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో తండ్రి కొడుకులుగా సముద్రఖని , ధనరాజ్ డైనమిక్ గా కనిపిస్తున్నారు. ఇంటెన్స్ తో కూడిన పోస్టర్ కు ప్రేక్షకుల దగ్గర నుంచి విశేష స్పందన లభిస్తోంది. 

ఇదివరకు ఎప్పుడూ చూడని ఒక తండ్రి కొడుకుల కథను అద్భుతంగా తెరమీద ఆవిష్కరిస్తున్నామని దర్శకుడు ధనరాజ్ తెలిపారు.. ఈ సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య పృద్వి,  శ్రీనివాసరెడ్డి, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు, చిత్రం శ్రీను, ప్రమోదిని తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి విమానం చిత్ర దర్శకుడు శివ ప్రసాద్ యానా కథ ను సమకూర్చగా అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నాడు. దుర్గా ప్రసాద్ ఈ సినిమాకు కెమెరామెన్ గా వ్యవహరిస్తుండగా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై, అమలాపురం, రాజమండ్రి, రాజోలు, పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

Also Read: Suryavanshi Thakur: ఐదు వందల ఏళ్ల తర్వాత నెరవేరిన శపథం.. పట్టువదలని సూర్యవంశి ఠాకూర్‌ వంశీయులు

Also Read: APCC Chief YS Sharmila: తొలి రోజే స్వరాష్ట్రం ఏపీలో వైఎస్‌ షర్మిలకు ఘోర అవమానం

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News