Raviteja Dhamaka Review: రవితేజ ధమాకా సినిమా ఎలా ఉంది? రివ్యూ - రేటింగ్ మీకోసం!

Dhamaka Movie Review: డిసెంబర్ 23వ తేదీన రవితేజ ధమాకా  సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.   

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 23, 2022, 11:57 AM IST
Raviteja Dhamaka Review: రవితేజ ధమాకా సినిమా ఎలా ఉంది? రివ్యూ - రేటింగ్ మీకోసం!

Dhamaka Movie Review: చివరిగా క్రాక్ అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ, తర్వాత ఖిలాడి అనే సినిమాతో ప్రేక్షకులకు వచ్చాడు కానీ ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయారు. అయితే ఇప్పుడు ఆయన ధమాకా అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. డిసెంబర్ 23వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలైంది.

ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటించడం, గతంలో డైరెక్టర్ త్రినాథరావు రైటర్ ప్రసన్నకుమార్ కాంబినేషన్ లో దొరికిన సినిమాలన్నీ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా మీద ఆసక్తి నెలకొంది. దానికి తగ్గట్లుగానే సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ స్టఫ్ అంతా సినిమా మీద మరింత అంచనాలు పెంచేయడంతో సినిమా మీద ప్రేక్షకులలో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను సినిమా రివ్యూలో చూద్దాం. 

ధమాకా కథ ఏమిటంటే?
చెల్లి(మోనికా రెడ్డి)కి పెళ్ళి చేయాలనే బాధ్యతతో స్వామి(రవితేజ) కష్టపడి ఉద్యోగం చేస్తూ ఉంటాడు, అనుకోకుండా ఉద్యోగం పోవడంతో ఆమె పెళ్లి చేసేందుకు తండ్రి గోవిందరావు(తనికెళ్ళ భరణి) కలిసి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మరోపక్క పీపుల్స్ మార్ట్ గ్రూప్ కి కాబోయే సీఈవోగా తన కుమారుడి(రవితేజ)ని రంగంలోకి దింపాలని చక్రవర్తి (సచిన్ కేడ్కర్) చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఆనంద్ అనబడే రవితేజ మాత్రం అందుకు ససేమిరా ఒప్పుకోడు.

ఒకరోజు స్వామి చెల్లెలు ఫోన్ నుంచి ఆపదలో ఉన్నాను ఆదుకోమని మెసేజ్ రావడంతో వెళ్లిన స్వామికి అక్కడ చెల్లెలు స్థానంలో ప్రణవి(శ్రీ లీల) కనిపిస్తుంది. మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిన స్వామి వెంటనే ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. అనూహ్యంగా ప్రణవి తండ్రి(రావు రమేష్) ఆనంద్ తో ప్రణవికి పెళ్లి చేయాలని నిశ్చయిస్తాడు.  ఇద్దరు వేరు వేరు వ్యక్తులు ఒకేలా ఉన్నారని తెలుసుకున్న ప్రణవి ముందు షాక్ అవుతుంది. ఎవరివి సెలెక్ట్ చేసుకోవాలో తెలియక ఇద్దరితోనూ ట్రావెల్ చేస్తూ ఉంటుంది.

మరోపక్క జెపి( జయరామ్) తన కుమారుడి కోసం పీపుల్స్ మార్ట్ తనకు తక్కువ ధరకే అమ్మేయాలని పెద్ద ఎత్తున ప్రజర్ పెడుతూ ఉంటాడు. అంతేకాక ఆనంద్, చక్రవర్తి మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నిస్తాడు. కానీ చివరికి ఏమైంది? జేపీ కాకుండా పీపుల్స్ మార్ట్ దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నది ఎవరు? అసలు స్వామి, ఆనంద్ లకు పరిచయం ఉందా? అసలు వీరిద్దరూ ఒక్కరేనా? లేక వేరు వేరు వ్యక్తులా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ
గతంలో త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో బెజవాడ ప్రసన్న కుమార్ అందించిన కథలు సూపర్ హిట్ కావడంతో ఈ కాంబినేషన్ మీద అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు తగినట్లుగానే ఈ సినిమాని కూడా రూపొందించారు. ధమాకా అనే పేరు ఎందుకు పెట్టారో సినిమా చూస్తే ఈజీగా అర్థమవుతుంది కానీ సినిమా కాస్త రొటీన్ వేలో సాగుతుంది. అయితే ట్విస్టులు మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఉన్నాయి.

ఎక్కడా తగ్గకుండా అటు కామెడీకి కామెడీ, డాన్స్ కి డాన్స్, మ్యూజిక్ కు మ్యూజిక్, రొమాన్స్ కి రొమాన్స్, యాక్షన్ కి యాక్షన్, ఎమోషన్ కి ఎమోషన్ ఎందులోనూ తగ్గకుండా అన్నింటినీ సమపాళ్లలో మేనేజ్ చేస్తూ సినిమా నడిపించారు డైరెక్టర్ అండ్ టీం. 54 ఏళ్ల రవితేజ పక్కన 21 శ్రీ లీల హీరోయిన్గా ఎలా సరిపోతుందని అనుకున్న అందరికీ షాక్ ఇచ్చే విధంగా ఇద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.

ఒకరకంగా సినిమా రొటీన్ కథతో చేసినా సరే కొత్త ట్రీట్మెంట్ తో ప్రేక్షకులను కొంత వరకు ఆకట్టుకోగలిగారు, సినిమా ఆద్యంతం కూడా ఆసక్తికరంగా ఎంటర్టైనింగ్ వేలో సాగిపోయింది అని చెప్పక తప్పదు. సినిమాలో ఉన్న కొన్ని లోపాలు పక్కన పెడితే సినిమా ఆద్యంతం ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది.

నటీనటులు
నటీనటుల విషయానికి వస్తే రవితేజ ద్విపాత్రాభినయంలో రెచ్చిపోయాడు. ఎప్పటిలాగే తనకు అచ్చొచ్చిన కామెడీ జానర్ ఎంచుకొని దాంట్లో కామెడీ పండించాడు. అదేవిధంగా యాక్షన్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా చేస్తూ ఈసారి డాన్స్ లో కూడా అదరగొట్టాడు. శ్రీ లీల కూడా తనకు అంది వచ్చిన అవకాశాన్ని బాగా ప్రూవ్చేసుకుంది.

తన పాత్రలో లీనమైపోయి మరి నటించింది. డాన్స్ లో కూడా ఏమాత్రం తగ్గకుండా శ్రీ లీల అదరగొట్టింది. ఇక సచిన్ ఖేడ్కర్, జయరామ్, తనికెళ్ల భరణి, సీత, పవిత్ర లోకేష్, సమీర్, ప్రవీణ్, హైపర్ ఆది, రావు రమేష్ వంటి వారు తమ పరిధి మేర ఆకట్టుకున్నారు. అయితే చాలా మంచి కమెడియన్ గా పేరు ఉన్న అలీ కేవలం రెండు సీన్లకే పరిమితమయ్యే పాత్ర ఎందుకు ఎంచుకున్నాడో మాత్రం తెలియదు.

టెక్నికల్ టీం 
టెక్నికల్ టీం విషయానికి వస్తే దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు త్రినాధరావు నక్కిన చాలా ప్రయత్నం చేశాడు. గతంలో ఆయన చేసిన సినిమాలతో మంచి పేరు రావడంతో దాన్ని మరింత పెంచుకునే ప్రయత్నం అయితే చేశాడు. అందులో కొంతమేర సఫలం అయ్యాడు కూడా ఇక రైటర్ ప్రసన్నకుమార్ తీసుకున్న పాయింట్ అయితే చాలా బాగుంది.

ట్రైలర్ చూసి అనేక సినిమాలతో పోలికలు పెడుతూ వచ్చారు. కానీ కొంత మంది సినిమా మాత్రం రొటీన్ గానే అనిపించినా ట్రీట్మెంట్ బాగుంది, భీమ్స్ సిసిరోలియో అందించిన మ్యూజిక్ సినిమాకి బాగా ప్లస్ అయింది. పాటలు ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా రిచ్ గా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా సరిపోయాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే
ధమాకా ఒక్క మాటలో చెప్పాలంటే ధమాకా పైసా వసూల్ ఎంటర్టైనర్ అందరికీ నచ్చకపోవచ్చు కానీ కామెడీ యాక్షన్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్
రేటింగ్: 2.5/5
 
Also Read: Kalpika Ganesh Controversy: వివాదాలతో సావాసం.. పిలవని పేరంటానికి వెళ్లి హాట్ టాపిక్!

Also Read: 18 Pages Movie: 18 పేజెస్ మూవీలో మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్.. టాలీవుడ్లో మొదటి సినిమాగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News