Devi sri Prasad: దేవీ శ్రీ ప్రసాద్ ఇంట్లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో బాబాయి, Heart attack తో మేనత్త మృతి

Devi sri Prasad's paternal uncle died in road accident: ఒక వైపు బాబాయి, మరోవైపు మేనత్త.. ఇలా ఇద్దరూ కొన్ని గంటల వ్యవధిలోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడంతో దేవిశ్రీ ప్రసాద్ కుటుంబసభ్యులు (Devi Sri Prasad family), సమీప బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Last Updated : Sep 17, 2021, 09:10 PM IST
Devi sri Prasad: దేవీ శ్రీ ప్రసాద్ ఇంట్లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో బాబాయి, Heart attack తో మేనత్త మృతి

Devi sri Prasad's uncle died in road accident: ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఇంట్లో విషాదం నెలకొంది. దేవిశ్రీ ప్రసాద్ బాబాయి బుల్గానిన్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. రోడ్డు ప్రమాదంలో బుల్గానిన్‌ని కోల్పోయిన దుఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని కొన్ని గంటల వ్యవధిలోనే మరో విషాదం వెంటాడింది. సోదరుడు ఇక లేరని తెలిసిన వెంటనే దేవీశ్రీ ప్రసాద్ మేనత్త సీతా మహాలక్ష్మి గుండెపోటుతో చనిపోయారు. 

ఒక వైపు బాబాయి, మరోవైపు మేనత్త.. ఇలా ఇద్దరూ కొన్ని గంటల వ్యవధిలోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడంతో దేవిశ్రీ ప్రసాద్ కుటుంబసభ్యులు (Devi Sri Prasad family), సమీప బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఊహించని పరిణామంతో ఒకేసారి ఇద్దరిని కోల్పోయిన ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. 

దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఇంట్లో జరిగిన విషాదం గురించి తెలుసుకున్న సినీ ప్రముఖులు, సన్నిహిత మిత్రులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. పలువురు ప్రముఖులు దేవీశ్రీ ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించారు.

దేవీశ్రీ ప్రసాద్ తండ్రి, ప్రముఖ రచయిత సత్యమూర్తి (Devi Sri Prasad's father Sathyamurthy) కూడా సరిగ్గా ఆరేళ్ల క్రితం ఇలాగే గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. దాదాపు 80కి పైగా చిత్రాలకు రచయితగా పనిచేసిన సత్యమూర్తికి వారసుడిగా దేవీశ్రీ ప్రసాద్ సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు.

Trending News