Devara Movie Review: ‘దేవర’ ఫస్ట్ రివ్యూ.. ఎన్టీఆర్‌కు మరో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్.. ఇక కలెక్షన్ల సునామీనే..!

Devara Movie First Review: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. జనతా గ్యారేజ్ తర్వాత వీళ్ల కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పీక్స్ కు చేరాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 12, 2024, 09:44 AM IST
Devara Movie Review: ‘దేవర’ ఫస్ట్ రివ్యూ.. ఎన్టీఆర్‌కు మరో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్.. ఇక కలెక్షన్ల సునామీనే..!

Jr NTR Devara Part-1 Movie First Review: ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ దేవర. రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్త్ కు సోషల్ మీడియాలో మంచి రెస్సాన్స్ వచ్చింది. అందుకు తగ్గట్టే ప్రమోషన్స్ కూడా జోరుగా చేస్తున్నారు. త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ప్యాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాపై క్రేజ్ ఏర్పడింది. మరోవైపు ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి ‘వార్ 2’ మూవీ చేస్తున్నారు.  

అందుకే దేవర హిట్ అనేది ఎన్టీఆర్ కు కంపల్సరీ. కేవలం తెలుగులోనే కాదు హిందీలో కూడా దేవర్ హిట్ కావడం అనేది ఎన్టీఆర్కు కీలకం అని చెప్పాలి. మరోవైపు రిలీజ్ కు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అక్కడ ఈ సినిమా హిట్ అయితేనే ఎన్టీఆర్ కు మేజర్ స్టార్ గా గుర్తింపు వస్తుంది. ఇప్పటికే ఈ సినిమాపై ట్రోలింగ్ మొదలైంది ఈ సినిమాలో ఆచార్య మూవీ ఛాయలు కనిపిస్తున్నాయని కొంత మంది పనికట్టుకొని ట్రోల్ చేస్తున్నట్టు సినిమా యూనిట్ చెబుతోంది. ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమా రెండు భాగాలకు రాబోతుంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న దేవరకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమాని నిడివి కూడా 2 గంటల 57 నిమిషాల 58 సెకండ్లు ఉంది. ఒక రకంగా ఇది భారీ రన్ టైమ్ అని చెప్పాలి. ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయని చెబుతున్నారు. మరోవైపు తారక్, జాన్వీ ల కెమిస్ట్రీ కూడా ఓ రేంజ్ లో ఆకట్టుకనే విధంగా చెబుతున్నారు. క్లైమాక్స్ ఈ సినిమాకు ప్రాణం అని చెబుతున్నారు. అటు కామెడీ కూడా ఓ రేంజ్ లో పేలిందని చెబుతున్నారు.  

ఈ సినిమాలో మరోసారి ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం యాక్ట్ చేస్తున్నాడు. గతంలో ఆంధ్రావాలా, శక్తి, అదుర్స్ సినిమాలో డ్యూయల్ లో ఎక్కేశారు. ‘జై లవకుశ’ తెలుగులో కనిపించాడు. మరోసారి ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడా లేకపోతే త్రిపాత్రాభినయం అనేది చూడాలి.

‘దేవర’ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది జాన్వీ కపూర్. అనిరుద్ సినిమాకు మంచి మ్యూజిక్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

భారీ అంచనాలతో సెప్టెంబర్ 27 సినిమా తెలుగులో ఎలాంటి సంచలనం చేస్తుందో చూడాలి.

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News