Devara Trailer Responce: ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజాగా చిత్రం ‘దేవర’. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) సినిమా తర్వాత తారక్ నుంచి వస్తోన్న చిత్రం కాబట్టి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మూడు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ కు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తూన్న ఈ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ ఆర్.రత్నవేలు అందించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించారు. ప్రొడక్షన్ డిజైనర్ గా సాబు శిరిల్ వ్యవహరించారు. ‘దేవర’ మూవీతో జాన్వీ కపూర్ టాలీవుడ్ లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. అటు బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమా ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఈ ట్రైలర్ విడుదలైన 12 గంటల్లో 8 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది.
ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన మూడు సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం మేకర్స్ ‘దేవర’ మూవీని థియేట్రికల్ ట్రైలర్‌ను ముంబైలో రిలీజ్ చేసారు. నిర్మాత కరణ్ జోహార్, అనిల్ తడాని సహా పలువురు ప్రముఖులు వేడుకకు హాజరయ్యారు. 2 నిమిషాల 35 సెకన్లున్న ఈ ట్రైలర్ మాస్ ఎలిమెంట్స్ పుల్ యాక్షన్ మీల్స్ అనేలా ఉంది. ఎన్టీఆర్ అభిమానులకు, యాక్షన్ మూవీ లవర్స్ కోరుకునే అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. ఈ మూవీ కోసం దర్శకుడు కొరటాల శివ క్రియేట్ చేసిన సెపరేట్ వరల్డ్, ఆయన విజన్ అద్భుతంగా ఉన్నాయనే టాక్ ఉన్నాయి. మరోవైపు ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కు రాజమౌళి సెంటిమెంట్ వెంటాడుతుంది. మరి ఈ సినిమాలో ఎన్టీఆర్ .. ఆ సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా అనేది చూడాలి.
అటు కొరటాల శివ కూడా ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత ఎన్టీఆర్ తో హిట్టు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమా తేడా కొడితే.. దర్శకుడిగా కొరటాల శివ కెరీర్ డైలామాలో పడుతుంది. ఈ సినిమాలో బైరా పాత్రలో సైఫ్ అలీ ఖాన్.. అక్కడ క్రూరమైన గ్యాంగ్స్ తో దోపిడీలకు పాల్పడుతుంటాడు. అంతేకాదు అక్కడ వచ్చే ఓడలను దోచుకోవడమే కాకుండా.. కోస్ట్ గార్డ్ లను చంపేస్తూ అరాచకాలు చేస్తుంటాడు. మరోవైపు అతని అరాచకాలకు ఎదురొడ్డే పాత్రలో ఎన్టీఆర్ నటించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఐదోసారి ఒకటి కంటే ఎక్కువ పాత్రల్లో నటిస్తున్నాడు.
జాన్వీకపూర్ ఇందులో తంగం అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది. ఆమె లుక్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయి.
ఈ సినిమా విషయానికొస్తే.. సోలో హీరోగా తారక్ కు ఫస్ట్ ప్యాన్ ప్యాన్ ఇండియా మూవీ. ఈ చిత్రం అన్ని ఏరియాల్లో థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అయింది. మరోవైపు ఓవర్సీస్ లో ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ చేస్తే ఇప్పటికే 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. విడదల వరకు ఈ రేంజ్ ఏ మేరకు వెళుతుందో చూడాలి. కర్ణాటకలో దేవర రూ. 18 కోట్లకు.. రాయలసీమలో రూ. 23 కోట్లకు బిజినెస్ చేసింది.
ఇక హిందీలో ‘దేవర’ రూ. 30 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. ఓవరాల్ గా థియేట్రికల్ గా రూ. 150 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ తో రంగంలోకి దిగుతుంది. ‘దేవర’ చిత్రం వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 27న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!