Deva Katta: సినిమా టికెట్ల అమ్మకాలు.. Ap govt పై దేవ కట్టా విమర్శలు

Deva Katta criticizes AP govt: ప్రైవేటు వ్యక్తులు తీసిన సినిమాల టికెట్లను (Cinema tickets) ప్రభుత్వం ఎలా అమ్ముకుంటుందని విమర్శించిన దేవ కట్టా అంతటితో వెనక్కి ఆగలేదు. ఇకపై సినిమాల నిర్మాణం కోసం ప్రభుత్వం బడ్జెట్ కూడా కేటాయిస్తుందా మరి అని ప్రశ్నించారు.

Written by - Pavan | Last Updated : Sep 9, 2021, 01:55 PM IST
Deva Katta: సినిమా టికెట్ల అమ్మకాలు.. Ap govt పై దేవ కట్టా విమర్శలు

Deva Katta criticizes AP govt: అమరావతి: సినిమా టికెట్లను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా విక్రయించాలన్న ఏపీ సర్కారు నిర్ణయాన్ని దర్శకుడు దేవ కట్టా తీవ్రంగా తప్పుపట్టారు. ఇండియన్ రైల్వే ప్రభుత్వం చేతి ఉంది కనుక రైల్వే టికెట్లను ప్రభుత్వం ఆన్‌లైన్‌లో విక్రయించడం సబబే కానీ ప్రైవేట్ వ్యక్తులైన నిర్మాతలు రూపొందించే సినిమాలను ప్రభుత్వం అమ్మాలనుకోవడం ఏంటని దేవ కట్టా ప్రశ్నించారు. నిర్మాతలు తీసే సినిమాల టికెట్లను నిర్మాతలకు స్వేచ్చ లేకుండా ప్రభుత్వం విక్రయించాలని (Movies tickets sales) అనుకోవడం కరెక్ట్ కాదని దేవ కట్టా అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా దేవ కట్టా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 

ప్రైవేటు వ్యక్తులు తీసిన సినిమాల టికెట్లను (Cinema tickets) ప్రభుత్వం ఎలా అమ్ముకుంటుందని విమర్శించిన దేవ కట్టా అంతటితో వెనక్కి ఆగలేదు. పోర్టల్ ద్వారా సినిమా టికెట్లు అమ్మినట్టయితే.. ఇక డబ్బులు పెట్టి సినిమాలు తీసిన నిర్మాతలు కూడా ప్రైవేట్ కాంట్రాక్టర్లు బిల్లుల కోసం వేచిచూసినట్టు వారి టికెట్ల డబ్బుల కోసం ప్రభుత్వం ముందు క్యూలో నిలుచోవాల్సి వస్తుందేమోనని విమర్శించారు. అంతేకాకుండా ఇకపై సినిమాల నిర్మాణం కోసం ప్రభుత్వం బడ్జెట్ కూడా కేటాయిస్తుందా మరి అని ప్రశ్నించారు. 

Also read : AP Government Online Movie Tickets : సినిమా టికెట్ల బుకింగ్‌ కోసం ఏపీలో ప్రభుత్వ పోర్టల్‌, రేట్ల విషయంలో పారదర్శకత

దేవ కట్టా (Deva Katta) మాత్రమే కాకుండా అతడి తరహాలోనే తెలుగు సినీ పరిశ్రమలోనూ ఏపీ సర్కారు నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలే ఓవైపు కరోనావైరస్ మహమ్మారి, లాక్‌డౌన్ల కారణంగా థియేటర్లు మూతపడే పరిస్థితి వచ్చింది. అనేక షరతుల మధ్య ఆక్యుపెన్సీని తగ్గించుకుని సినిమాలు విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా టికెట్ల విక్రయాలపై ప్రభుత్వం పట్టు సంపాదించుకోవాలనుకోవడం ఎటువైపునకు దారితీస్తుందోననే టాక్ వినిపిస్తోంది. ఈ విమర్శలపై ఏపీ సర్కారు (AP govt) ఏమని స్పందిస్తుందో వేచిచూడాల్సిందే మరి.  

దేవ కట్టా సినిమాల విషయానికొస్తే.. సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవ కట్టా డైరెక్ట్ చేసిన రిపబ్లిక్ మూవీ (Republic movie) అక్టోబర్ 1న ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాలో సాయి జిల్లా కలెక్టర్ పాత్రలో నటిస్తున్నాడు. సాయిధరమ్ సరసన ఐశ్వర్య రాజేష్ (Actress Aishwarya Rajesh) జంటగా నటిస్తోంది.

Also read : Pawan Kalyan remuneration: పవన్ కల్యాణ్ పారితోషికం రూ. 60 కోట్లా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News