Deepika Padukone : దీపిక, అనన్య రొమాన్స్‌లో రెచ్చిపోయారట.. అందుకే ఓటీటీలో రిలీజ్‌

Deepika Padukone film in OTT : దీపికా పదుకొణె, అనన్య పాండే, సిద్దాంత్ చతుర్వేది నటీనటులుగా ఒక మూవీ తెరకెక్కుతోంది. శకున్ బత్రా డైరెక్టర్. ఈ ఏడాది ఆగస్టులో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. మూవీలో రొమాన్స్ ఎక్కువ డోస్‌లోనే ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 4, 2021, 04:42 PM IST
  • దీపికా పదుకొణె, అనన్య పాండే, సిద్దాంత్ చతుర్వేది నటీనటులుగా తెరకెక్కుతోన్న మూవీ
  • ఈ ఏడాది ఆగస్టులో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్
  • వివాహేతర సంబంధాల నేపథ్యంలో మూవీ
  • మూవీలో రొమాన్స్ డోస్‌ ఎక్కువే
Deepika Padukone : దీపిక, అనన్య రొమాన్స్‌లో రెచ్చిపోయారట.. అందుకే ఓటీటీలో రిలీజ్‌

Deepika Padukone movie may head to OTT due to high octane intimate scenes: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వచ్చాక.. చాలా మూవీలో థియేటర్స్‌లలో కంటే వాటిలోనే రిలీజ్ అవుతున్నాయి. కోవిడ్ ప్యాండమిక్ వల్ల కొన్ని సినిమాలు ఇలా రిలీజ్ అయ్యాయి. అయితే మరికొన్ని మూవీలు మాత్రం.. సెన్సార్ బోర్డుతో ఇబ్బందులు తలెత్తడం వల్ల ఓటీటీలో (OTT) రిలీజ్ చేసుకోవాల్సి వస్తోంది. ఇలా బాలీవుడ్ సినిమా ఒకటి.. ఓటీటీలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. 

వివాహేతర సంబంధాల (Extramarital affair) కథాంశంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. అయితే ఇందులో రొమాన్స్ (Romance) ఓ రేంజ్‌లో ఉందట.. అందుకే మూవీని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. 

దీపికా పదుకొణె, (Deepika Padukone) అనన్య పాండే, (Ananya Panday) సిద్దాంత్ చతుర్వేది ( Siddhant Chaturvedi) నటీనటులుగా ఒక మూవీ తెరకెక్కుతోంది. శకున్ బత్రా (Shakun Batra) డైరెక్టర్. ఈ ఏడాది ఆగస్టులో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అయితే ఇంత వరకు మూవీ టైటిల్‌‌ను (Movie title‌) అనౌన్స్ చెయ్యలేదు. ఇక ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే రిలీజ్ అవుతుందట. 

Also Read : అభిమానులకు గుడ్ న్యూస్.. భీమ్లా నాయ‌క్ కోసం పాట పాడిన ప‌వ‌న్! విడుదల ఎప్పుడంటే!!

ఈ మూవీలో దీపికా పదుకొణె, అనన్య పాండే అక్కాచెల్లెళ్లుగా నటిస్తున్నారు. దీపిక ఫిట్‌నెస్ ట్రైనర్‌‌గా (fitness trainer) కనిపించనుంది. వివాహేతర సంబంధాల (xtramarital affair) నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. మూవీలో రొమాన్స్ ఎక్కువ డోస్‌లోనే ఉంది. దీన్ని థియేటర్లల్లో విడుదల చేయాలంటే సెన్సార్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి. కానీ సెన్సార్ బోర్డు దగ్గరికి వెళ్తే.. మూవీలో అసలైన సీన్లకు కత్తెర పడే ఛాన్స్ ఉంది. 

ఆ సీన్లు సెన్సార్ (censor board) వాళ్లు లేపేస్తే.. దాని ప్రభావం సినిమా మొత్తంపై పడుతుంది. ఎందుకొచ్చింది ఈ గోల అనుకున్నట్లుంది మూవీ యూనిట్.. శుభ్రంగా ఓటీటీలో (direct to OTT release) రిలీజ్ చేస్తే.. ఏ సెన్సార్ ఉండదని మూవీ మేకర్స్ భావిస్తున్నారట. ఈ మూవీని ధర్మ ప్రొడక్షన్స్ ( Dharma Productions) పతాకంపై కరణ్ జోహార్ ( Karan Johar) నిర్మిస్తున్నారు. 

Also Read : Coronavirus: ఆ దేశంలో ఇటీవలే మొట్టమొదటి కరోనా కేసు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News