Dasari Awards: దర్శకరత్న దాసరికి అరుదైన గౌరవం.. ఇకపై ఆయన పేరిట ప్రతి యేట అవార్డులు..

Dasari Narayana Rao Film Awards: తెలుగు చిత్ర పరిశ్రమలో దాసరి నారాయణ రావు గురించి తెలియని వారు ఉండరు. చిత్ర సీమలో ఎంతో మంది దర్శకులకు, నిర్మాతలకు, నటీనటులకు పెద్ద దిక్కుగా నిలిచారు. ఇకపై ప్రతి సంవత్సరం ఘనంగా  దర్శకరత్న డి.ఎన్.ఆర్. ఫిల్మ్ అవార్డ్స్ ఇవ్వనున్నట్టు తెలిపారు.

Last Updated : Apr 12, 2024, 03:56 PM IST
Dasari Awards: దర్శకరత్న దాసరికి అరుదైన గౌరవం.. ఇకపై ఆయన  పేరిట ప్రతి యేట అవార్డులు..

Dasari Narayana Rao Film Awards: దాసరి నారాయణ రావు కేవలం దర్శకుడిగానే కాకుండా... నిర్మాతగా, నటుడిగా.. రచయతగా, పత్రికాధినేతగా.. రాజకీయవేత్తగా బహుముఖ ప్రజ్ఞ దాసరి నారాయణ రావు సొంతం. అంతేకాదు ఇపుడు అందరు చెప్పుకున్నట్టుగా రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ కంటే ముందు బాలీవుడ్ సహా ఇతర సినీ ఇండస్ట్రీస్‌లో దర్శకుడిగా అప్పట్లో ప్యాన్ ఇండియా క్రేజ్‌ తెచ్చుకున్నారు. అంతేకాదు తెలుగు చిత్రసీమలో వివిధ రంగాల్లో శతాధిక దర్శకుడిగా అచంద్రతారార్కం నిలిచిపోయారు. ఈ యేడాది రాబోయే 77వ దాసరి నారాయణ రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు
 ఆయన ప్రియ శిష్యులు సన్నాహాలు చేస్తున్నారు. దాసరి బహుముఖ ప్రతిభను నేటి తరానికి గుర్తు చేస్తూ... వారిలో స్ఫూర్తిని నింపేందుకు "దర్శకరత్న డి.ఎన్. ఆర్.ఫిల్మ్ అవార్డ్స్" పేరిట తెలుగు సినిమా రంగానికి చెందిన వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన అవార్డుల ఇవ్వడం ద్వారా దర్శకరత్న దాసరికి ఘన నివాళులు అర్పించనున్నారు.

దర్శకరత్నతో సుదీర్ఘమైన అనుబంధం కలిగిన ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు - ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ అధ్యక్షకార్యదర్శులుగా ఇందుకోసం ఏర్పాటైన కమిటీలో  ఆడిటర్ గా, ఆర్ధిక సలహాదారుగా దాసరితో ప్రత్యేక అనుబంధం కలిగిన బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ, ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు, ధీరజ అప్పాజీ ఇందులో  సభ్యులుగా ఉన్నారు.

హైదరాబాద్, శిల్పకళావేదికలో  మే 5న ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఇందులో  "దర్శకరత్న డి.ఎన్. ఆర్.ఫిల్మ్ అవార్డ్స్" జ్యురీ మెంబర్స్ తమ్మారెడ్డి భరద్వాజ, రేలంగి నరసింహారావు, బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ, ప్రభు, అప్పాజీలతోపాటు... తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.

తమ్మారెడ్డి మాట్లాడుతూ... "దశాధిక రంగాల్లో రాణించిన దాసరికి నివాళులు అర్పిస్తూ... "అభినవ దర్శకరత్న, అభినయ రత్న, నిర్మాణరత్న, పంపిణీరత్న, ప్రదర్శనారత్న, కథారత్న, సంభాషణారత్న, గీతరత్న, పాత్రికేయరత్న, సేవారత్న" పురస్కారాలు ప్రదానం చేయనున్నట్టు తెలిపారు.  ఇతర అవార్డులను స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ సినిమాల నుంచి ఎంపిక చేయనున్నట్టు తెలిపారు.  
రేలంగి నరసింహారావు మాట్లాడుతూ... "దాసరి లేని లోటు ఎప్పటికీ తీరనిది. ఈ అవార్డుల ఎంపిక అత్యంత పారదర్శకంగా, ప్రామాణికంగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.

బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ మాట్లాడుతూ... "దాసరి ప్రధమ జయంతిని ఘనంగా నిర్వహించాం. కరోన కారణంగా కంటిన్యూ చేయలేకపోయాయాము. ఇకపై ప్రతి ఏటా ఈ అవార్డు వేడుక నిర్వహిస్తామన్నారు. టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ... ప్రభుత్వం అవార్డులు ఇవ్వకున్న  బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ ఈ అవార్డులను మహానుభావుడైన దాసరి పేరిట అవార్డ్స్ ఇస్తుండడం  అభినందనీయం" అన్నారు.

ప్రభు మాట్లాడుతూ... "చిత్ర పరిశ్రమలోని ప్రతి విభాగంలో అత్యద్భుత ప్రతిభ కనబరిచిన ఒకే ఒక్కడు దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణ రావు. ఆయన స్మారకార్ధం నిర్వహిస్తున్న ఈ పురస్కారాల వేడుకకు యావత్ చిత్ర పరిశ్రమ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ధీరజ అప్పాజీ మాట్లాడుతూ... "అవార్డ్స్ కమిటీలో చోటు దక్కించుకోవడం తనకు "లైఫ్ టైమ్ అచీవ్మెంట్' లాంటిదన్నారు.

Also Read: KT Rama Rao: కాంగ్రెస్‌ అభ్యర్థిపై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు.. 'పనికి రాని చెత్త'గా అభివర్ణన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News