Karan Johar Birthday: కరణ్‌ జోహర్‌.. పార్టీ ఇచ్చావా లేదా కరోనా వైరస్‌ను ఇచ్చావా?

Karan Johar birthday party called Covid-19 hotspot. సోషల్ మీడియాలో కరణ్ జోహార్ బర్త్ డే పార్టీ పెద్ద సంచలనంగా మారింది. నెటిజన్లు ఊరుకంటారా? బాలీవుడ్ నిర్మాతను ఓ ఆడేసుకుంటున్నాడు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 5, 2022, 07:56 PM IST
  • కరణ్ జోహార్ ఇచ్చిన బర్త్ డే పార్టీ
  • బాలీవుడ్‌ నటులకు వైరస్‌
  • పార్టీ ఇచ్చావా లేదా కరోనా వైరస్‌ను ఇచ్చావా?
Karan Johar Birthday: కరణ్‌ జోహర్‌.. పార్టీ ఇచ్చావా లేదా కరోనా వైరస్‌ను ఇచ్చావా?

Netizens trolls Karan Johar birthday party after Bollywood celebrities test positive: మొన్నటి వరకు శాంతించిన కరోనా వైరస్ మహమ్మారి దేశ వ్యాప్తంగా మళ్లీ పంజా విసురుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు మహమ్మారి భారిన పడగా.. తాజాగా బాలీవుడ్‌ను వణికిస్తోంది. బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌, సీనియర్ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ వైరస్‌ బారినపడ్డారు. అలాగే ఆదిత్య రాయ్‌ కపూర్‌, కార్తీక్‌ ఆర్యన్‌తో పాటు పలువురు బాలీవుడ్‌ నటులకు వైరస్‌ సోకింది. దీంతో బాలీవుడ్‌లో మరోసారి ఆందోళన వ్యక్తమవుతున్నాయి. 

ఒకేసారి 50 మంది స్టార్లు కరోనా బారిన పడడం భారీ షాక్‌కు గురిచేస్తోంది. ఇందుకు కారణం బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ ఇచ్చిన బర్త్ డే పార్టీ అని సమాచారం. ఈ పార్టీలో పాల్గొన్న దాదాపుగా 55 మంది అతిథులకు వైరస్ సోకిందని బీ టౌన్‌లో గుసగుస వినిపిస్తున్నాయి. మే 25న కరణ్ జోహార్ తన 50వ పుట్టినరోజు సందర్భంగా అంధేరీలోని యష్ రాజ్ స్టూడియోస్‌లో గ్రాండ్ పార్టీ ఇచ్చిన విషయం విదితమే. ఈ పార్టీకి బాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులు నటీనటులు హాజరయ్యారు. 

కరణ్ జోహార్ బర్త్ డే పార్టీకి షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, కాజల్, మాధురి దీక్షిత్‌, జూహీ చావ్లా, ప్రీతి జింటా, ఐశ్వర్య రాయ్, రాణి ముఖర్జీ, రవీనా టండన్, జాన్వీ కపూర్, రణ్వీర్ సింగ్, దీపికా పదుకునే, కత్రినా కైఫ్, కియారా అద్వానీ, కృతి సనన్, వరుణ్ ధావన్, సిద్ధార్థ మల్హోత్రా, ఆదిత్య రాయ్ కపూర్‌తో పాటు పలువురు పార్టీకి హాజరయ్యారు. ఇక టాలీవుడ్ నుంచి రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అందాల నేషనల్ క్రష్ రష్మిక మందన కూడా వెళ్లారు.

పార్టీ అయిన మరుసటి రోజు నుంచే ఒక్కొక్కరుగా కరోనా వైరస్ బారిన పడుతున్నారని సమాచారం. ఇప్పటికే 55 మంది స్టార్లు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో కరణ్ జోహార్ బర్త్ డే పార్టీ పెద్ద సంచలనంగా మారింది. నెటిజన్లు ఊరుకంటారా? బాలీవుడ్ నిర్మాతను ఓ ఆడేసుకుంటున్నాడు. కామెంట్స్, మీమ్స్ పోస్ట్ చేస్తూ రెచ్చిపోతున్నారు. కరణ్‌ జోహర్‌.. పార్టీ ఇచ్చావా లేదా కరోనా వైరస్‌ను ఇచ్చావా? అంటూ చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read: Virata Parvam Trailer: అమ్మ నువ్ అతడిని కనిపించేలా చేస్తే.. కోన్ని కోసి, కళ్ళు శాఖ పోస్తా!  

Also Read: Major Collections: రెండ‌వ రోజు 'మేజ‌ర్' చిత్రం హవా.. మొత్తం ఎంత క‌లెక్ట్ చేసిందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News