Color Photo teaser: టీజర్‌‌కి సూపర్ రెస్పాన్స్

మజిలీ సినిమాలో చైతూకి స్నేహితుడి పాత్రలో నటించి మెప్పించిన సుహాస్‌ని ( Suhas ) హీరోగా పరిచయం చేస్తూ అమృత ప్రొడక్షన్స్ రూపొందిస్తున్న కలర్ ఫోటో మూవీ టీజర్‌కి ( Color Photo movie teaser ) ఆడియెన్స్ నుండి మంచి స్పందన కనిపిస్తోంది.

Last Updated : Aug 6, 2020, 10:39 PM IST
Color Photo teaser: టీజర్‌‌కి సూపర్ రెస్పాన్స్

మజిలీ సినిమాలో చైతూకి స్నేహితుడి పాత్రలో నటించి మెప్పించిన సుహాస్‌ని ( Suhas ) హీరోగా పరిచయం చేస్తూ అమృత ప్రొడక్షన్స్ రూపొందిస్తున్న కలర్ ఫోటో మూవీ టీజర్‌కి ( Color Photo movie teaser ) ఆడియెన్స్ నుండి మంచి స్పందన కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda ) చేతుల మీదుగా విడుదలైన కలర్ ఫోటో టీజర్‌‌ విడుదలైన 12 గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్‌కిపైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఒక సాధారణ ఆర్టిస్టుని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న సినిమా టీజర్‌కి ఈ స్థాయిలో స్పందన కనిపించడం చాలా అరుదు. ఇదే సినిమాతో సందీప్ రాజ్ అనే ఓ కొత్త దర్శకుడు కూడా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. Also read: Anushka Sharma: విరాట్ కోహ్లీకి నచ్చని విషయం అదే

సుహాస్ సరసన తెలుగు అమ్మాయి చాందిని చౌదరి ( Chandini Chowdary ) జంటగా నటిస్తుండగా సునీల్, వైవా హర్ష ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో హీరో సునీల్ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు కాల భైరవ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. శ్రవణ్ కొంక, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రజెంట్ చేస్తున్న ఈ సినిమాను అమృత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయి రాజేష్, బెన్ని ముప్పనేని నిర్మిస్తున్నారు. Also read: టీవీ నటుడు సమీర్ మృతి.. స్పందించిన పోలీసులు

హృదయ కాలేయం, కొబ్బరిమట్ట వంటి హిలేరియస్ కామెడీ చిత్రాలు నిర్మించిన అమృత ప్రొడక్షన్స్‌కి మళ్లీ ఈ సినిమా టీజర్‌కి లభించిన స్పందన సైతం మంచి బూస్టింగ్‌ని ఇస్తోంది. Also read: నితిన్ సినిమాను పూజా హెగ్డే అందుకే రిజెక్ట్ చేసిందా ?

Trending News