Guntur Kaaram: స్టైలిష్ లుక్‌లో మహేష్.. గుంటూరు కారం క్రిస్మస్ పోస్టర్ అదిరిపోయింది..

Guntur Kaaram: సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ఆడియెన్స్ ముందుకు రానున్నాడు. ఈ లోపే ఫ్యాన్స్ కు స్పెష‌ల్ ట్రీట్ ఇచ్చింది మూవీటీమ్.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2023, 11:25 AM IST
Guntur Kaaram: స్టైలిష్ లుక్‌లో మహేష్.. గుంటూరు కారం క్రిస్మస్ పోస్టర్ అదిరిపోయింది..

Mahesh Babu Christmas Poster: సూపర్ స్టార్ మహేష్ బాబు నయా మూవీ 'గుంటూరు కారం'( Guntur Kaaram). స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌద‌రిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో చిత్రయూనిట్ మూవీ ప్రమోషన్స్ ను షురూ చేసింది. 

అయితే తాజాగా గుంటూరు కారం మూవీటీమ్ ఫ్యాన్స్‌ కు సర్ ప్రైజ్ ఇచ్చింది. క్రిస్మ‌స్ కానుక‌గా మ‌హేష్‌బాబు కొత్త పోస్ట‌ర్‌ను విడుదల చేసింది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన అన్ని పోస్టర్స్ లో మాస్ లుక్ లో కనిపించిన మహేష్.. దీనిలో మాత్రం క్లాస్ లుక్‌లో యమ స్టైలిస్ గా ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన దమ్‌ మసాలా బిర్యానీ, ఓ మై బేబీ సాంగ్‌ల‌ు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. మరోవైపు ఈ చిత్రంలో ఓ ఐటెం సాంగ్ కూడా ఉందట. అయితే ఈ సాంగ్ కోసం టాలీవుడ్ డ‌స్కీ బ్యూటీ డింపుల్ హయాతిని తీసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అత‌డు, ఖ‌లేజా త‌ర్వాత మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారంపై భారీ లెవల్లో అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని దాదాపు రెండు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో చినబాబు నిర్మిస్తున్నారు. ఇందులో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కీలకపాత్రలు పోషిస్తున్నారు. 

Also Read: Urfi Javed And Sofia Ansari: ఉర్ఫీ జావేద్, సోఫియా అన్సారీలు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఎంత సంపాదిస్తారో తెలిస్తే..మైండ్‌ బ్లాక్‌ అవ్వుది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News