Chiranjeevi: చిరంజీవి..తెలుగు సినీ చరిత్రలో ఆయన కంటూ కొన్ని పేజీలున్నాయి. తన తరంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరో రేంజ్ కు ఎదిగారు. అంతేకాదు తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు 25 యేళ్లు నెంబర్ హీరోగా సత్తా చాటారు. మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లి దెబ్బలు తిని .. తిరిగి సినీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు రీ ఎంట్రీలో కూడా తన సినిమాలతో అదరగొడుతున్నారు. ఈ నెల 22న చిరంజీవి 69 యేళ్లు నిండుతున్నాయి. ఈ సందర్బంగా అభిమానులు ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు రెండు రాష్ట్రాల్లో చేపడుతున్నారు. మరోవైపు అభిమానుల కోసం చిరంజీవి ఒకటికి మూడు ట్రీట్లు రెడీ చేసినట్టు సమాచారం.
ఈ నెల 22న చిరంజీవి బర్త్ డే సందర్బంగా ఆయన నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఇంద్ర’తో పాటు ‘శంకర్ దాదా MBBS’ మూవీలను రీ రిలీజ్ చేస్తున్నారు. దీంతో పాటు చిరంజీవి నటిస్తూన్న ‘విశ్వంభర’ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేయనున్నట్టు సమాచారం. మరోవైపు ‘విశ్వంభర’ సినిమా తర్వాత చేయబోయే ప్రాజెక్ట్స్ ను ఆ రోజున అఫీషియల్ గా ప్రకటించబోతున్నట్టు సమాచారం.
ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..
మరోవైపు ఈ యేడాది మెగా ఫ్యామిలీకి ప్రత్యేకంగా నిలిచింది. చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మ విభూషణ్’తో అందుకున్నారు. అటు రామ్ చరణ్ .. గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అటు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన, టీడీపీ, బీజేపీ ఏపీలో అధికారంలోకి వచ్చింది. మరోవైపు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. మొత్తంగా ఈ బర్త్ డే కూడా ప్రత్యేకంగా ఉండేలా మెగాభిమానులు ప్లాన్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..
చిరంజీవి విశ్వంభర సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో చాలా యేళ్ల తర్వాత త్రిష చిరు సరసన నటిస్తోంది. అంతేకాదు ఈ చిత్రానికి ఎన్నో దశాబ్దాల తర్వాత కీరవాణి చిరంజీవి సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మొత్తంగా ఎన్నో ప్రత్యేకతలతో వస్తోన్న ఈ చిత్రం వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter