Chiranjeevi oxygen banks: ప్రాణాపాయ స్థితిలో ఉండి రక్తం లేని కారణంగా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడే ప్రాణాలను రక్షించాలనే దృఢ సంకల్పంతో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకును (Chiranjeevi blood bank) స్థాపించారు. అంతకు ముందు ఆ తర్వాత ఎన్ని బ్లడ్ బ్యాంకులు పుట్టుకొచ్చినా... చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అందించిన సేవలు మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోదగినవి అనే చెప్పుకోవాలి. తన సినిమాలతోనే కాకుండా చిరంజీవి బ్లడ్ బ్యాంకుతో ఇంకెంతో మంది హృదయాలకు చేరువైన చిరంజీవి తాజాగా కరోనావైరస్ వ్యాప్తితో ఆక్సీజన్ అందక కష్టాలు పడుతున్న వారికి అండగా నిలిచేందుకు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
అప్పుడు ఎలాగైతే బ్లడ్ బ్యాంక్ ద్వారా అత్యవసరంలో ఉన్న వారికి రక్తాన్ని అందించి ఎలా సేవలు అందించారో.. అలాగే కరోనా సోకి ఆక్సీజన్ లేక ఇబ్బంది పడే వారికి ఆ ప్రాణవాయువు అందించి వారి ప్రాణాలు కాపాడేందుకు చిరంజీవి మరో ముందడుగేశారు. తెలంగాణ, ఏపీలోని అన్ని జిల్లాల్లో జిల్లాకు ఒకటి చొప్పున ఆక్సీజన్ బ్యాంక్ ఏర్పాటు చేసేందుకు చిరంజీవి ముందుకొచ్చారు. ఈ మేరకు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ట్విటర్ ద్వారా వెల్లడించింది.
Also read : Sonu Sood: త్వరలో పాన్ ఇండియా మూవీలో హీరోగా సోనూసూద్, కథ సిద్దం చేసిన క్రిష్
చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు కానున్న ఆక్సీజన్ బ్యాంకులు (Oxygen banks) మరో వారం రోజుల్లో ప్రజలకు అందుబాటులో రానున్నాయి. ఆక్సీజన్ బ్యాంకుల ఏర్పాటు, పర్యవేక్షణ బాధ్యతలు తండ్రి చిరంజీవికి (Chiranjeevi) తోడుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చూసుకోనున్నట్టు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook