Chiranjeevi-Garikapati : మళ్లీ వివాదం షురూ.. గరికపాటి మీద చిరంజీవి పరోక్ష సెటైర్లు.. వీడియో వైరల్

Chiranjeevi Indirect Satires on Garikapati తాజాగా చిరంజీవి ఓ ఈవెంట్‌కు వెళ్లాడు. అక్కడున్న మహిళలంతా కూడా చిరంజీవితో ఫోటో దిగేందుకు వచ్చారు. దీంతో చిరు గరికపాటి వారు లేరు కదా? అన్నట్టుగా కౌంటర్లు వేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 29, 2022, 07:39 AM IST
  • వివాదంగా మారిన అలయ్ భలయ్
  • గరికపాటి మీద మెగా అభిమానుల ఆగ్రహం
  • తాజాగా గరికపాటి మీద చిరు సెటైర్లు
Chiranjeevi-Garikapati : మళ్లీ వివాదం షురూ.. గరికపాటి మీద చిరంజీవి పరోక్ష సెటైర్లు.. వీడియో వైరల్

Chiranjeevi-Garikapati : అలయ్ భలయ్ కార్యక్రమంలో చిరంజీవితో మహిళా అభిమానులు ఫోటోలు, సెల్ఫీలు దిగుతుంటే.. అది ఆపమని, లేదంటే తాను వెళ్లిపోతానంటూ గరికపాటి అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గరికపాటి అలా అన్నా కూడా చిరంజీవి ఎంతో వినమ్రంగా వచ్చాడు. నమస్కరించాడు. అనంతరం తన ప్రసంగంలో గరికపాటి గొప్పదనాన్ని వివరించాడు. అక్కడితే ఎవరు ఉన్నతంగా ఉన్నారు.. ఎవరు అథమంగా ప్రవర్తించారో అందరికీ అర్థమైంది. అయితే ఆ తరువాత నాగబాబు ఎంట్రీ, మెగా అభిమానులు, చిరు భక్తుల ఎంట్రీతో కథ మారిపోయింది.

చివరకు రాను రాను చిరంజీవి వర్గం వైపే తప్పు ఎక్కువగా జరిగినట్టు అనిపించింది. గరికపాటిని ఇన్ని మాటలు అనాలా? ఇంత ట్రోలింగ్ చేయాలా? అంటూ అందరూ మెగా ఫ్యాన్స్‌ను ప్రశ్నించారు. చివరకు గరికపాటి కూడా క్షమాపణలు చెప్పాడు. నాగబాబు సైతం ఓ మెట్టు దిగాడు. ఆయనతో క్షమాపణలు చెప్పించుకునే ఉద్దేశ్యం తమకు లేదని అన్నాడు. ఇక చిరంజీవి సైతం గాడ్ ఫాదర్ ప్రమోషన్స్‌లో ఈ విషయం మీద ప్రస్థావించాడు. మనల్ని ఒక మాట అంటే.. మనం వెంటనే రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు.. ఆయన పెద్ద వారు.. అంటూ గరికపాటి మీద కామెంట్ చేశాడు.

 

అయితే ఇప్పుడు మళ్లీ ఈ వివాదం పైకి లేచేలా ఉంది. తాజాగా చిరంజీవి ఓ ఈవెంట్‌కు వెళ్లాడు. అక్కడ మహిళాభిమానులంతా కూడా ఫోటోలు దిగేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో చిరు తన కామెడీ టైమింగ్‌తో సెటైర్ వేశాడు. మహిళలంతా కూడా ఫోటోల కోసం వస్తుంటే.. ఇక్కడ వారు లేరు కదా? అంటూ గరికపాటి మీద పరోక్షంగా సెటైర్ వేశారు. వారు లేరు కదా? హమ్మయ్య అయితే ఓకే అన్నట్టుగా చిరంజీవి తన అభిమానులతో ఫోటోలు దిగాడు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. కొందరేమో చిరు టైమింగ్‌ను చూసి ఇష్టపడుతుంటే.. మళ్లీ గెలకడం అవసరమా? అంటూ ఇంకొందరు నెటిజన్లు అంటున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం ఇప్పుడు నెట్టింట్లో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. దీనిపై గరికపాటి స్పందిస్తాడో లేదో చూడాలి.

Also Read : VK Naresh Pavitra Lokesh Video : నరేష్ పవిత్ర బంధం.. భుజం మీద నుంచి చేయిని తీయడమే లేదుగా

Also Read : Vennela Kishore - Manchu Vishnu : అసహ్యంగా చూస్తున్న వెన్నెల కిషోర్.. మంచు విష్ణు చేష్టలే కారణమా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News