Chiranjeevi Dupe: గత 30 యేళ్లుగా చిరంజీవి డూప్‌గా నటిస్తోన్న ఆ వ్యక్తి ఎవరో తెలుసా.. ?

Chiranjeevi Dupe: మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన తన సినిమాల్లో డాన్స్, ఫైట్స్‌తో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక కొన్ని సినిమాల్లో రిస్కీ ఫైట్ షాట్స్‌లో నటించి మెప్పించారు. అయితే ఎంతటి హీరో అయిన కొన్ని సన్నివేశాలకు మాత్రం డూప్ కావాల్సిందే. ఇక చిరంజీవికి గత 30 యేళ్లుగా పైగా ఓ వ్యక్తి డూప్‌గా నటిస్తున్నారు. ఆయనెవరంటే..

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 25, 2024, 11:27 AM IST
 Chiranjeevi Dupe: గత 30 యేళ్లుగా చిరంజీవి డూప్‌గా నటిస్తోన్న ఆ వ్యక్తి ఎవరో తెలుసా.. ?

Chiranjeevi Dupe: చిరంజీవి విషయానికొస్తే.. తన 45 యేళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. అందులో ఎన్నో రిస్కీ సీన్స్ చేసారు. ఎక్కువ మటుకు రియల్ స్టంట్స్ చేసే చిరంజీవి కొన్ని సందర్భాల్లో దర్శకులు, నిర్మాతలు హీరోకు ఆయా సన్నివేశాల్లో ఏదైనా దెబ్బలు తగిలితే.. షూటింగ్ మొత్తం అప్‌సెట్ అవుతోంది. అందుకే కొన్ని సీన్స్‌లో హీరోకు ఆయా సీన్స్ చేయాల్సి ఉన్నా.. డూప్‌తో యాక్ట్ చేయిస్తూ ఉంటారు. అది కూడా ఎక్కువగా రిస్కీ అనుకున్న సన్నివేశాల కోసమే డూప్‌తో ఆయా సన్నివేశాలను తీస్తుంటారు.

ఇలా చిరంజీవికి ఓ వ్యక్త గత 30 యేళ్లుగా చిరుకు డూప్‌గా నటిస్తూ వస్తున్నారు. చిరు సినిమాల్లో  చేయాల్సిన కొన్ని రిస్కీ షాట్స్‌ ను ఇతను చేసి మెగాస్టార్ మన్ననలు అందుకను్నాడు. ఇక చిరంజీవికి గత కొన్నేల్లుగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రేమ్ కుమార్ డూప్‌గా నటిస్తూ వస్తున్నారు. ఈయనది పాల్లకొల్లులోని మార్టూరు. ఈయన తన పేరు మీద 'ప్రేమ్ కుమార్ రికార్డింగ్ డాన్స్' అంటూ ఓ కంపెనీ ఉంది. ఈయన ఓ ఛానెల్‌ నిర్వహించిన కార్యక్రమంలో చిరుకు డూప్‌గా నటిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.

చిరంజీవి విషయానికొస్తే.. లాస్ట్ వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలతో పలకరించారు. అందులో వాల్తేరు వీరయ్య.. వీర లెవల్లో హిట్టైయితే.. భోళా శంకర్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అందుకే చిరంజీవి తన అప్ కమింగ్ సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కోవలో 'బింబిసార'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు వశిష్ఠతో నెక్ట్స్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాకు 'విశ్వంభర' అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ సినిమాలో ఇప్పటికే చిరు సరసన త్రిష యాక్ట్ చేస్తోంది. ఆమెతో పాటు ఈషా చావ్లా , సురభిలు నటిస్తున్నారు. ఇందులో అప్సరస క్యారెక్టర్స్ చేయబోతున్నట్టు సమాచారం.

'విశ్వంభర' మూవీని 2025 జనవరి 10న సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తున్నట్టు ముందే ప్రకటించి సంక్రాంతి బెర్త్ కన్ఫామ్ చేసుకుంటున్నారు. ఓ వైపు సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో పాటు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్స్ కోసం కసరత్తు చేస్తూ రెడీ అవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి.

ఇప్పటికే విడుదలైన 'విశ్వంభర' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు When MYTHS Collides Legends Rise అని చెబుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. అంటే ఎపుడైతే అద్భుత శక్తులు కలుస్తాయో.. అపుడు ఒక లెజెండ్ అదే అద్భుతమైన వ్యక్తి పుట్టుకొస్తాడని అర్ధంలో కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసారు. ముందుగా ఈ సినిమాకు 'ముల్లోక వీరుడు' అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. కానీ ఫైనల్‌గా ఈ మూవీకి 'విశ్వంభర' టైటిల్ ఫిక్స్ చేసారు.

చిరు.. యముడికి మొగుడు, జగదేకవీరుడు అతిలోక సుందరి. అంజి సినిమాల తర్వాత నటిస్తోన్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర' కావడం విశేషం. ఈ మూవీలో చిరంజీవిని ఢీ కొట్టే విలన్ పాత్రలో తమిళ హీరో శింబు యాక్ట్ చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు తమిళంలో శింబుతో తమిళంలో ఈ సినిమాకు మంచి మార్కెట్ దొరికే అవకాశం ఉంది. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ $4 మిలియన్ యూఎస్ డాలర్స్‌కు అమ్ముడు పోయినట్టు సమాచారం. చిరంజీవి గత సినిమాలేవి 1 మిలియన్ డాలర్ మించి కలెక్ట్ చేయలేదు. ఇలాంటి సమయంలో సబ్జెక్ట్ పై నమ్మకంతో పాటు సంక్రాంతి సీజన్ కలిసొస్తుందనే నమ్మకంతో బయ్యర్స్ ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ఈ రేటు పెట్టి కొన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు చిరంజీవి కూతురు సుస్మిత నిర్మాణంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ భాగస్వామ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం రవితేజతో 'మిస్టర్ బచ్చన్' మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ హిందీలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన 'రెయిడ్' మూవీకి రీమేక్. మరోవైపు పవన్ కళ్యాణ్‌తో చేస్తోన్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ఎన్నికల తర్వాత ఈ యేడాది ద్వితీయార్ధంలో మళ్లీ ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఆ లోపు రవితేజ తర్వాత చిరుతో ఈ సినిమా కంప్లీట్ చేయనున్నాడు. త్వరలో ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Also read: Janasena-Tdp List: జనసేన-తెలుగుదేశం ఉమ్మడి జాబితా విడుదల, జనసేనకు 24 స్థానాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News