Political dialogue goes viral form Megastar Chiranjeevis GodFather Movie: మోహన్‌రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘గాడ్‌ఫాదర్’. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయనతార, హీరో సత్యదేవ్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న గాడ్‌ఫాదర్ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. దసరా కానుకగా అక్టోబరు 5న విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలను చిత్ర బృందం వేగవంతం చేసింది.
గాడ్‌ఫాదర్ నుంచి ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి చెప్పిన డైలాగ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను కానీ.. రాజకీయం నా నుంచి దూరం కాలేదు' అని చిరు అన్నారు. రాజకీయాల గురించి చిరంజీవి చెప్పిన డైలాగ్ అభిమానులను అలరిస్తోంది. ఈ డైలాగ్‌కు సంబందించిన ఆడియోను చిరు ట్విటర్‌గా వేదికగా పంచుకోగా.. నిమిషాల్లోనే వైరల్ అయింది. ఈ ఆడియోకి గాడ్‌ఫాదర్ ఫొటో ఉండడంతో.. సినిమాలోని డైలాగ్ అని ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ డైలాగ్ మెగాస్టార్ చిరంజీవి నిజ జీవితానికి దగ్గరగా ఉందని చాలా మంది ట్వీట్స్ చేస్తున్నారు. సినిమాలు వదిలేసి 'ప్రజారాజ్యం' పార్టీ స్థాపించిన చిరు రాజకీయాల్లో అడుగుపెట్టారు. అనంతరం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. కేంద్ర మంత్రిగానూ చిరంజీవి చేశారు. ఇక రాజకీయాలు వదిలి ‘ఖైదీ నంబర్ 150’లో రీఎంట్రీ ఇచ్చారు. సైరా, ఆచార్య సినిమాలు చేసిన మెగాస్టార్.. ఇప్పుడు గాడ్‌ఫాదర్ చేశారు. ఈ సినిమా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది.
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 20, 2022
మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటించిన మలయాళ హిట్ సినిమా ‘లూసిఫర్’ రీమేక్‌గా ‘గాడ్‌ఫాదర్’ తెరకెక్కింది. చిరు స్టార్‌డమ్‌కు అనుగుణంగా డైరెక్టర్ మోహన్‌రాజా కథలో చిన్న చిన్న మార్పులు చేశారట. మలయాళంలో పృథ్వీరాజ్ పోషించిన పాత్రను తెలుగులో సల్మాన్ ఖాన్ పోషించారు. చిరంజీవి చెల్లి పాత్రలో నయనతార కనిపించనున్నారు. ఇక విలన్ పాత్రలో సత్యదేవ్ నటించారు. ఆచార్య ఫ్లాఫ్ కావడంతో గాడ్‌ఫాదర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read: కాటేయడానికి దూసుకొచ్చిన 14 అడుగుల కింగ్ కోబ్రా.. ఒట్టి చేతులతో ఎలా కంట్రోల్ చేశాడో చూడండి!
Also Read: 49 ఏళ్ల వయసులోనూ 'తగ్గదేలే'.. సచిన్ బ్యాక్‌ఫుట్ పంచ్‌కు దద్దరిల్లిన స్టేడియం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.