KTR birthday: కేటీఆర్‌కు చిరు, పలువురు సినీ తారల విషెస్‌

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు (KTR) కు సినీ, క్రీడా, రాజ‌కీయ ప్ర‌ముఖుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. 

Last Updated : Jul 24, 2020, 01:06 PM IST
KTR birthday: కేటీఆర్‌కు చిరు, పలువురు సినీ తారల విషెస్‌

Celebrities Birthday Wishes to KTR: హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే. తారకరామారావు ( KTR ) కు సినీ, క్రీడా, రాజ‌కీయ ప్ర‌ముఖుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) కూడా త‌న ట్విట్ట‌ర్ వేదికగా కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కేటీఆర్‌తో దిగిన ఫోటోని షేర్ చేసి ఇలా రాశారు.

‘‘డియ‌ర్ తార‌క్ హ్యాపీ బ‌ర్త్‌డే.. మీరు నిర‌పేద‌ల‌కు ఎల్ల‌ప్పుడు అందుబాటులో ఉండ‌డంతో పాటు వ్య‌క్తిగ‌తంగా వారి ద‌గ్గ‌రికి వెళ్ళి సాయం చేయ‌డం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందుకు నేను కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. మీరు మరిన్ని సంవ‌త్స‌రాలు ఇలా ప్ర‌జ‌ల‌కి సేవ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అని చిరు ట్విట్ చేశారు. చిరు ట్వీట్‌కి స్పందించిన కేటీఆర్ ధన్య‌వాదాలు సర్ అంటూ రీట్విట్ చేశారు. Also read: Minister KTR: కేటీఆర్‌కు శుభాకాంక్షల వెల్లువ

అదేవిధంగా సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) కూడా కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన శుభాకాంక్షలు.. మీకు ఆరోగ్యం, శ్రేయస్సు ప్రసాదించాలని మేము చిలుకూరు బాలాజీని ప్రార్థిస్తున్నామంటూ ఆయన ట్విట్ చేశారు.  టాలీవుడ్ సుపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) కూడా ట్విట్ చేసి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీంతోపాటు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ( vvs laxman ) కూడా ట్వీట్ చేసి మంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇదిలాఉంటే.. టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ( Rakul Preet Singh )  కూడా కేటీఆర్‌కు ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు రకుల్ హ్యాపీ హ్యాపీ బర్త్‌డే కేటీఆర్. ఈ సంవత్సరమంతా మీరు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలంటూ ఆమె ట్విట్‌లో రాసింది. 

 జబర్దస్త్ యాంకర్ Anasuya లేటెస్ట్ ఫొటోలు   
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్

Trending News