Charmee Kaur Clarity on Rumors: కేజీఎఫ్2 రేంజ్ లో డైలాగ్ చెప్పి నోళ్లు మూయించిన ఛార్మీ.. దృష్టి అక్కడే ఉందట!

Charmee Kaur Clarity on Rumors about Puri Jagannadh and Puri Connects: ఛార్మీ కౌర్ చేసిన తాజా ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 8, 2022, 05:07 PM IST
Charmee Kaur Clarity on Rumors: కేజీఎఫ్2 రేంజ్ లో డైలాగ్ చెప్పి నోళ్లు మూయించిన ఛార్మీ.. దృష్టి అక్కడే ఉందట!

Charmee Kaur Clarity on Rumors about Puri Jagannadh and Puri Connects: ఒకప్పటి సినీ హీరోయిన్ ఛార్మి ప్రస్తుతం పూరి జగన్నాథ్ తో కలిసి సినీ నిర్మాతగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలకు ఛార్మి కౌర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల వీరి కాంబినేషన్లో లైగర్ అనే సినిమా రూపొంది విడుదలైంది. భారీ అంచనాలతో భారీ బడ్జెట్ తో విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా రూపొందించిన ఈ సినిమాను ఆగస్టు 25వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులకు ముందుకు తీసుకువస్తే అది దారుణమైన డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది.

దీంతో పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ చేస్తున్న జనగణమన సినిమా ఆగిపోయిందని ప్రచారం పెద్ద ఎత్తున ఊపందుకుంది. సరిగ్గా అదే సమయంలో ఛార్మి కౌర్ తాను సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకుంటున్నానని అన్ని సెట్ అయినాక బలంగా కంబ్యాక్ ఇస్తానని చెప్పుకొచ్చారు. ఛార్మీ అలా ప్రకటించిన తర్వాత మరిన్ని పుకార్లు పుట్టుక రావడం మొదలయ్యాయి. ఇప్పుడు తాజా గాసిప్ ఏమిటంటే పూరీ జగన్నాథ్ ముంబైలో 15 లక్షల రూపాయలు పెట్టి ఫ్లాట్ రెంట్ కడుతున్నాడట.

అయితే ఇప్పుడు అది అనవసరమని భావించి ముంబై ఫ్లాట్ ఖాళీ చేశారని ప్రచారం జరుగుతోంది. అంతేగాక ఆయనతో మరే హీరో సినిమా చేయడానికి సిద్ధంగా లేడు కాబట్టి సొంత కొడుకు ఆకాష్ పూరీతోనే మరో సినిమా ప్లాన్ చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. ఇలా ఇన్ని ప్రచారాలు జరుగుతున్న క్రమంలో ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. కేజిఎఫ్ 2లో బాగా ఫేమస్ అయిన వైలెన్స్ డైలాగు గుర్తు చేస్తూ రూమర్స్, రూమర్స్, రూమర్స్ అన్నీ ఫేక్ రూమర్స్ అని రాసుకొచ్చారు.

పూరి కనెక్ట్స్ ను మరింత అభివృద్ధి చేయడానికి ఫోకస్ చేస్తున్నాం ఈలోపు రూమర్స్ కి రెస్టిన్ పీస్ అంటూ ఆమె పేర్కొన్నారు. అంటే పూరీ జగన్నాథ్ గురించి పూరి కనెక్ట్స్ గురించి వారు చేస్తున్న సినిమాలు గురించి జరుగుతున్న అన్ని ప్రచారాలకు ఛార్మి కౌర్ ఈ ఒక్క ట్వీట్ తో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది. మరి ఈ పుకార్లు ఇక్కడితో ఆగుతాయో లేక మరింత ప్రచారం జరుగుతాయో చూడాల్సి ఉంది. 
Also Read: RJ Surya Caste issue: సూర్య మన కులపోడే.. ఓటేసి గెలిపించండి!

Also Read: Divya Vani to Join BJP: బీజేపీలోకి దివ్యవాణి.. అంతా సిద్ధమే కానీ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News