women police beating Video : ఎంత కోపంగా ఉందో మాటల్లో చెప్పలేను.. పోలీసులపై కలర్ ఫోటో హీరోయిన్ ఫైర్

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 22, 2023, 10:10 AM IST
  • బీహార్‌లో అమానవీయ ఘటన
  • వృద్దుడ్ని మహిళా పోలీసుల ప్రతాపం
  • కలర్ ఫోటో చాందిని చౌదరి ఆగ్రహం
women police beating Video : ఎంత కోపంగా ఉందో మాటల్లో చెప్పలేను.. పోలీసులపై కలర్ ఫోటో హీరోయిన్ ఫైర్

police beating old teacher సోషల్ మీడియాలో మంచి, చెడు రెండూ ఒకే రకంగా వైరల్ అవుతుంటాయి. అయితే మంచి కాస్త స్లోగా జనాల్లోకి వెళ్తుంది. సోషల్ మీడియా ద్వారా న్యాయం కూడా త్వరగా లభించే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవ్వడం, దాని తీవ్రతను చూసి జనాలు రియాక్ట్ అవ్వడం, న్యాయం కావాలంటే పబ్లిక్ డిమాండ్ చేయడం అందరికీ తెలిసిందే. అధికారులు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఘటనల మీద ఎక్కువగా స్పందిస్తుంటారు. తాజాగా బీహార్‌లోని మహిళా పోలీసులు ఓ వృద్దుడిని చితకబాదిన వీడియో ఇప్పుడు నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది.

నావల్ కిషోర్ పాండే (60) అనే ఆంగ్ల ఉపాధ్యాయుడు రోడ్డు మీద సైకిల్‌తో వెళ్తున్నాడు. అయితే పోలీసులు ఆపమని సైగలు చేసినా ఆపకుండా వెళ్లిపోయాడట. దీంతో ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ వచ్చి ఆ వృద్దుడిని చితకబాదారు. లాఠీలతో కొడుతున్న ఈ వీడియోలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో జనాలు ఆ పోలీసుల మీద మండి పడుతున్నారు. ఆ ఇద్దరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

నేను పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ చేసే స్థితిలోనూ లేను. వారి నాపై దాదాపు 20 లాఠీ దెబ్బలు కొట్టేశారు. నా కాళ్లు చేతులు వాచిపోయాయి. నాకు న్యాయం కావాలి అంటూ సదరు సీనియర్ సిటీజన్ డిమాండ్ చేశాడు. దీనిపై ఎస్పీ, డీఎస్పీలు కూడా స్పందించారు. విచారణ చేయిస్తామని, తగిన న్యాయం చేస్తామని, చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.

అయితే ఈ వీడియో మీద కలర్ ఫోటో ఫేమ్ చాందినీ చౌదరి స్పందించింది. ఇది ఎంత దారుణమో మాటల్లో చెప్పలేను..కోపంగా ఉంది.. గుండె బద్దలవుతోంది అంటూ చాందినీ చౌదరి పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది.

Also Read:  Disha Patani Pics : చెక్కిన శిల్పంలా ఉంది!.. ఒంపుసొంపులు కనిపించేలా దిశా పటానీ అందాల ప్రదర్శన

Also Read: Deva Katta : ఆ స్క్రిప్ట్ నాదే.. బీర్ బాటిల్స్ నావి కాదు.. దేవా కట్టా పోస్ట్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News