Chaavu Kaburu Challaga: RX 100 ఫేమ్ కార్తికేయ, లావణ్య త్రిపాఠి లేటెస్ట్ మూవీ OTTలో వీక్షించండి

Chaavu Kaburu Challaga on AHA: కార్తికేయ, ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ సినిమా చావు కబురు చల్లగా. క్రేజీ కాంబినేషన్‌లో ఈ సినిమాను టాలీవుడ్ డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించాడు. ఓటీటీ వేదికగా ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 23, 2021, 01:51 PM IST
  • టాలీవుడ్‌లోనూ ఓటీటీ ప్లాట్‌ఫామ్ హవా కొనసాగుతోంది
  • కార్తికేయ, లావణ్య త్రిపాఠి నటించిన లేటెస్ట్ మూవీ చావు కబురు చల్లగా
  • ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది
Chaavu Kaburu Challaga: RX 100 ఫేమ్ కార్తికేయ, లావణ్య త్రిపాఠి లేటెస్ట్ మూవీ OTTలో వీక్షించండి

Chaavu Kaburu Challaga on AHA: ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ, ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ సినిమా చావు కబురు చల్లగా. క్రేజీ కాంబినేషన్‌లో ఈ సినిమాను టాలీవుడ్ డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించాడు. గత ఏడాది కరోనా సమయంలో ప్రారంభించిన మూవీ షూటింగ్ కొన్నిరోజులు వాయిదా పడింది. ప్రభుత్వం అనుమతి ఇచ్చాక శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా మార్చి 19న విడుదలైంది.

ఇటీవల థియేటర్లలో విడుదలైన ‘చావు కబురు చల్లగా..’ మూవీ గురించి మూవీ యూనిట్ మరో అప్‌డేట్ ఇచ్చింది.  టాలీవుడ్(Tollywood) ప్రేక్షకులను ఓటీటీ వేదికగా ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. ఓవైపు సినిమా థియేటర్లు మూసివేయడంతో ఓటీటీలోనే సినిమాలు వీక్షించడం అలవాటు చేసుకున్నారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో చావు కబురు చల్లగా(Chaavu Kaburu Challaga) మూవీ స్ట్రీమింగ్ అవుతుందని ప్రముఖ పీఆర్వో బీఏ రాజు తెలిపారు. ఈ మేరకు ఆహా లింక్ షేర్ చేస్తూ ఈ అప్‌డేట్‌ను టాలీవుడ్ ప్రేక్షకులకు అందించారు. 

Also Read: Chaavu Kaburu Challaga Songs: కార్తికేయ, లావణ్య త్రిపాఠి లేటెస్ట్ మూవీ సాంగ్స్ Jukebox

‘ఆసుపత్రిలో సిస్టర్‌గా చేస్తున్నావ్.. మంచి జాబ్. మనకు కావాల్సిన అమ్మాయి మనకు తప్ప అందరికీ సిస్టర్ అయితే చాలా బాగుంటుందని’ హీరో కార్తికేయ(Karthikeya) చెప్పే డైలాగ్‌కు మంచి స్పందన వచ్చింది. ‘నాలుగు పీకి ఇక్కడ పడుకోబెడితే నీకు కూడా నేను సిస్టర్ అవుతా’ అంటూ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) కౌంటర్ ఇచ్చిన డైలాగ్‌ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించిన చావు కబురు చల్లగా మూవీ Aha వేదికగా ఇంట్లోని కూర్చుని కరోనా భయాలు లేకుండా సరదాగా వీక్షించండి.

Also Read: Fix Ayipo Video Song: Chaavu Kaburu Challaga నుంచి ‘ఫిక్స్ అయిపో’ మరో మాస్ సాంగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News