Janaki vs State of Kerala: కేరళ యాక్షన్ సూపర్ స్టార్ సురేష్ గోపి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. యాక్షన్ హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి మలయాళ ప్రేక్షకులతో పాటు తెలుగు ఆడియన్స్ ను సైతం అలరించారు. రీసెంట్ గా 2024లో జరిగిన ఎన్నికల్లో లోక్ సభ కు పోటీ చేసి బీజేపీ తరుపున తొలి ఎంపీగా గెలిచి రికార్డు క్రియేట్ చేసారు. తాజాగా ఈయన లీడ్ రోల్ల్ యాక్ట్ చేసిన చిత్రం ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రలో నటించింది. కాస్మోస్ ఎంటర్టైన్మెంట్స్ పై జె. ఫణీంద్ర కుమార్ నిర్మాతగా ప్రవీణ్ నారాయణ దర్శకత్వం వహించారు.
గాడ్స్ ఓన్ కంట్రీ అని చెప్పుకునే కేరళ రాష్ట్రంలో యదార్థ సంఘటనల ఆధారంగా వాస్తవిక దృక్ప కోణంలో తీసిన ఈ సినిమా జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (జె. ఎస్. కె). బైజు సందోష్, మాధవ్ సురేష్ గోపి, దివ్య పిళ్లయి, అస్కర్ అలీ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఇంటెన్స్ కోర్టు డ్రామాగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
అనుపమ పరమేశ్వరన్ సినిమాలో జానకి పాత్రలో నటించింది. యదార్థ సంఘటన ఆధారంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జానకి పై జరిగిన అన్యాయాన్ని కోర్టులో ఎలా ఎదుర్కొంది అన్న అంశాన్ని ఇంటెన్స్ డ్రామాగా నిర్మించారు. ఈ కేసును వాదించే లాయర్ పాత్రలో సూపర్ స్టార్ సురేష్ గోపి అద్భుతంగా నటించారు. ఈ సినిమాని వచ్చే యేడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో సురేష్ గోపీ, అనుపమ పరమేశ్వరన్ పోటాపోటీగా నటించారు. 2024లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కేరళలోని త్రిసూర్ నుంచి ఎంపీగా గెలిచి సంచలనం రేపారు. అంతేకాదు నరేంద్ర మోడీ మంత్రివర్గంలో పెట్రోలియం నాచురల్ గ్యాస్ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.