Sushant case: దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ ఆఫీసర్ మనోజ్ శశిధర్

బాలీవుడ్ నటుడు ( Bollywood actor sushant singh rajputh ) సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు త్వరలో ఓ కొలిక్కి రానుంది. సుశాంత్ మరణంపై నెలకొన్న అనేక వాదనలు, అనుమానాలు నివృత్తి కానున్నాయి. కేసు దర్యాప్తు బాధ్యతను తీసుకున్న సీబీఐ ప్రత్యేక బృందం రంగంలో దిగింది.

Last Updated : Aug 6, 2020, 08:14 PM IST
Sushant case: దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ ఆఫీసర్ మనోజ్ శశిధర్

బాలీవుడ్ నటుడు ( Bollywood actor sushant singh rajputh ) సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు త్వరలో ఓ కొలిక్కి రానుంది. సుశాంత్ మరణంపై నెలకొన్న అనేక వాదనలు, అనుమానాలు నివృత్తి కానున్నాయి. కేసు దర్యాప్తు బాధ్యతను తీసుకున్న సీబీఐ ప్రత్యేక బృందం రంగంలో దిగింది.

సుశాంత్ సింహ్ రాజ్ పుత్ మరణించి రెండు నెలలు కావస్తున్నా ప్రతిరోజూ ఏదో మలుపు తిరుగుతూనే ఉంది ఈ కేసు. ప్రతిరోజూ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో సంచలనం రేపిన సుశాంత్ మృతి కేసును సీబీఐ ( CBI ) కు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఐపీఎస్ అధికారి మనోజ్ శశిధర్ ( IPS Officer Manoj sasidhar ) నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఇప్పుడు రంగంలో దిగింది. డీజీపీ గగన్ దీప్ గంభీర్ ఈ విచారణను పర్యవేక్షించనున్నారు. కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ ( FIR copy ) ను వెబ్ సైట్ లో ఎంట్రీ చేస్తామని సీబీఐ తెలిపింది. రంగంలో దిగిన వెంటనే సీబీఐ ప్రత్యేక బృందం అవసరమైన కాగితాల కోసం బీహార్ పోలీసుల్ని సంప్రదించారు. 

ఇదిలా ఉండగా ఇదే కేసులో సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్ ఫోర్స్ మెంట్  డైరెక్టరేట్  కూడా రంగంలో దిగింది. మనీ ల్యాండరింగ్ ఆరోపణలతో  రియా చక్రవర్తి ( Rhea Chakraborty )కి సమన్లు పంపించింది ఈడీ. Also read: Sushant singh: రియా చక్రవర్తికు ఈడీ సమన్లు

Trending News