BuchiBabu Remunerations : రెండో సినిమాకే అన్ని కోట్లా?.. నక్కతోక తొక్కిన బుచ్చిబాబు.. రామ్ చరణ్‌కు ఎన్ని కోట్లంటే?

Buchibabu Sana Remunerations రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో స్టార్డంను సంపాదించుకున్నాడు. అయితే రామ్ చరణ్‌ ప్రస్తుతం తీసుకుంటున్న రెమ్యూనరేషన్‌ గురించి చర్చలు జరుగుతున్నాయి. అదలా ఉంచితే.. బుచ్చిబాబు తీసుకుంటున్న మొత్తంపై అంతా నోరెళ్లబెట్టేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 22, 2022, 04:14 PM IST
  • ఉప్పెనతో సంచలనం క్రియేట్ చేసిన బుచ్చిబాబు
  • రెండో సినిమా కోసం బుచ్చిబాబు కసరత్తులు
  • బుచ్చిబాబుకు రూ. 20 కోట్ల రెమ్యూనరేషన్‌
BuchiBabu Remunerations : రెండో సినిమాకే అన్ని కోట్లా?.. నక్కతోక తొక్కిన బుచ్చిబాబు.. రామ్ చరణ్‌కు ఎన్ని కోట్లంటే?

Buchibabu Sana Remunerations ఉప్పెన సినిమాతో బుచ్చిబాబు అందరినీ ఆశ్చర్యపోయాడు. టాలీవుడ్‌ టాప్ దర్శకుల్లో బుచ్చిబాబు చేరిపోయాడు. మొదటి సినిమానే వంద కోట్లు కొల్లగొట్టేయడంతో అందరూ బుచ్చిబాబుని చూసి నోరెళ్లబెట్టేశారు. సుకుమార్ శిష్యుడిగా వచ్చి తన మార్క్ చూపించాడు. అయితే ఇప్పుడు బుచ్చిబాబు మాత్రం తన రెండో సినిమాతోనే పాన్ ఇండియన్ డైరెక్టర్ అయ్యేలా కనిపిస్తున్నాడు. బుచ్చిబాబు రెండో సినిమా విషయంలో ఎన్ని ట్విస్టులు వచ్చాయో అందరికీ తెలిసిందే.

బుచ్చిబాబు రెండో సినిమాను ముందు ఎన్టీఆర్‌తో అనుకున్నారు. అధికారికంగా కూడా చెప్పేశారు. కబడ్డీ స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్‌లో సినిమా ఉంటుందని చెప్పారు. చివరకు ఎన్టీఆర్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో అదే సినిమాను రామ్ చరణ్‌తో తీస్తున్నాడు బుచ్చిబాబు. ఈ మేరకు రామ్ చరణ్‌ తన గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టును పక్కన పెట్టేశాడు. ఇలా చివరకు బుచ్చిబాబు రామ్ చరణ్‌ ప్రాజెక్ట్ మీద అధికారిక ప్రకటన వచ్చింది.

ఈ చిత్రాన్ని మైత్రీ, సుకుమార్ రైటింగ్స్ ప్రజెంట్ చేస్తుండగా.. సతీష్‌ కిలారు నిర్మిస్తున్నాడు. అయితే ఈ చిత్రం కోసం రామ్ చరణ్‌ తీసుకుంటున్న రెమ్యూనరేషన్, బుచ్చిబాబు తీసుకుంటున్న మొత్తం మీద వినిపిస్తోన్న టాక్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రెండో సినిమాకే బుచ్చిబాబు ఇంత మొత్తం తీసుకుంటున్నాడా? అని షాక్ అవుతున్నారు.

రామ్ చరణ్‌ ప్రస్తుతం వంద కోట్లు తీసుకుంటున్నాడు. ఈ సినిమాకి కూడా అంతే తీసుకుంటున్నాడట. రెండో సినిమాకే బుచ్చిబాబు ఖాతాలో ఇరవై కోట్లు పడుతున్నాయట. ఇప్పుడు బోయపాటి, త్రివిక్రమ్ వంటి వారికే ఇరవై కోట్లు అందుతున్నాయో లేదో తెలియడం లేదు. కానీ బుచ్చిబాబుకు మాత్రం ఇరవై కోట్లు ఇస్తున్నారనే టాక్ వస్తోంది.

Also Read : Nandamuri Taraka Ratna : ఎన్టీఆర్‌ది నందమూరి రక్తం.. యంగ్ టైగర్‌పై తారకరత్న కామెంట్స్

Also Read : Pooja Ramachandran Baby Bump : పూజా రామచంద్రన్ బేబీ బంప్ పిక్స్.. భర్తను ముద్దుల్లో ముంచెత్తిన బిగ్ బాస్ బ్యూటీ 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News