Brahmastra Pre Release Event: ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి.. ఇంకా బాగా నేర్చుకుంటా: రణ్‌బీర్‌ కపూర్‌

 Ranbir Kapoor talks in Tgelugu at Hyderabad Brahmastra Movie Press Meet. ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా వచ్చిన బ్ర‌హ్మ‌స్త్ర‌ ప్రెస్‌ మీట్‌లో రణ్‌బీర్‌ కపూర్ తెలుగులో మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 3, 2022, 01:33 PM IST
  • తెలుగులో మాట్లాడి ఆశ్చర్యపరిచిన రణ్‌బీర్‌
  • ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి
  • తెలుగు ఇంకా బాగా నేర్చుకుంటా
Brahmastra Pre Release Event: ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి.. ఇంకా బాగా నేర్చుకుంటా: రణ్‌బీర్‌ కపూర్‌

Ranbir Kapoor talks in Tgelugu at Brahmastra Press Meet at Hyderabad: 'శంషేరా' సినిమాతో భారీ ప‌రాజ‌యాన్ని ఖాతాలో వేసుకున్న బాలీవుడ్ హీరో ర‌ణ్‌బీర్ కపూర్.. 'బ్ర‌హ్మ‌స్త్ర‌'పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఎలాగైనా భారీ విజ‌యం సాధించాల‌నే క‌సితో ఉన్నాడు. అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో అలియా భట్‌ కథానాయికగా నటిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాను దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజ‌మౌళి విడుద‌ల చేస్తున్నారు. ఇప్పటికే చిత్రం చిత్ర యూనిట్ విడుద‌ల చేసిన ట్రైలర్ సినిమాపై అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. ఫాంట‌సీ అడ్వేంచ‌ర్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కిన బ్ర‌హ్మ‌స్త్ర‌ సెప్టెంబ‌ర్ 9న విడుదల కానుంది. 

బ్ర‌హ్మ‌స్త్ర‌ సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో మేక‌ర్స్ హిందీతో పాటు తెలుగులో కూడా జోరుగా ప్ర‌మోష‌న్‌లు జరుపుతున్నారు. వైజాగ్‌లో జరిగిన ప్రెస్‌ మీట్‌కు విశేష స్పంద‌న వచ్చిన నేపథ్యంలో.. రామోజీ ఫిలిం సిటీలో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రాజ‌మౌళి ప్లాన్ చేశారు. ఈ వేడుక‌కి టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను ముఖ్య అతిథిగా పిలిచారు. అయితే చివ‌రి నిమిషంలో తెలంగాణ పోలీస్‌ల నుంచి ప‌ర్మీష‌న్ రాక‌పోవ‌డంతో.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ క్యాన్సిల్ అయింది. ఇక చేసేదిలేక పార్క్ హ‌య‌త్ హోట‌ల్‌లో ప్రెస్ మీట్‌ను నిర్వ‌హించారు. 

ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా వచ్చిన బ్ర‌హ్మ‌స్త్ర‌ ప్రెస్‌ మీట్‌లో రణ్‌బీర్‌ కపూర్ తెలుగులో మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. 'నా సినీ కెరీర్‌లో అతిపెద్ద సినిమా బ్రహ్మాస్త్ర. పెద్ద ఈవెంట్‌ కూడా ఇదే. మంచి సినిమాను ఎప్పుడూ ప్రోత్సహించే తెలుగు ప్రేక్షకులు అందరికి  ధన్యవాదాలు. బ్ర‌హ్మ‌స్త్ర‌ సినిమా అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నా. మాకు మీ అండదండలు కావాలి. ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి. పార్ట్‌ 2 సమయానికి తెలుగు బాగా నేర్చుకుంటా' అని రణ్‌బీర్‌ అన్నారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)

తెలుగులో మాట్లాడటం కోసం రణ్‌బీర్‌ కపూర్ మూడు రోజులు శిక్షణ తీసుకున్నారని ఆయన సతీమణి అలియా భట్‌ తెలిపారు. రణ్‌బీర్‌ తెలుగులో మాట్లాడడంతో చాలా బాగుందన్నారు. తాను రాజమౌళి సర్‌ హీరోయిన్‌ను అని ఆయన లేకుంటే ఈ సినిమా లేదన్నారు. ఎన్టీఆర్‌ ఈ సినిమాను సపోర్ట్‌ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని అలియా చెప్పారు. 

మైథ‌లాజిక‌ల్ అడ్వెంచ‌రస్ డ్రామాగా తెర‌కెక్కిన బ్ర‌హ్మ‌స్త్ర‌ సినిమా మూడు భాగాలుగా తెర‌కెక్క‌నుంది. మొద‌టి భాగం ‘శివ’ పేరుతో హిందీ.  తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల కానుంది. ఈ సినిమాలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, కింగ్ నాగార్జున‌ కీల‌క‌ పాత్ర‌ల్లో న‌టించ‌గా.. మౌనీ రాయ్ విల‌న్ పాత్ర‌లో న‌టించారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్‌, ప్రైమ్ ఫోక‌స్‌, స్టార్ లైట్ పిక్చ‌ర్స్ సంస్థ‌లు సంయుక్తంగా బ్ర‌హ్మ‌స్త్ర‌ చిత్రాన్ని నిర్మించాయి.

Also Read: IND vs PAK: భారత్‌ అరుదైన రికార్డును బ్రేక్ చేసిన పాకిస్తాన్‌.. టాప్‌లో శ్రీలంక!

Also Read: పాకిస్తాన్‌తో కీలక మ్యాచ్.. హై ఆల్టిట్యూడ్ మాస్క్‌తో విరాట్ కోహ్లీ! అసలు విషయం ఏంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News