Abhishek Bachchan: పాలిటిక్స్ లోకి రాబోతున్న అభిషేక్​ బచ్చన్​? 2024 ఎన్నికల్లో ఆ స్థానం నుంచే పోటీ?

 Abhishek Bachchan : బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కుమారుడు, బాలీవుడ్​ స్టార్​ హీరో అభిషేక్​ బచ్చన్​ త్వరలో రాజకీయ ఆరంగ్రేటం చేయనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన యూపీ నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 16, 2023, 01:07 PM IST
 Abhishek Bachchan: పాలిటిక్స్ లోకి రాబోతున్న అభిషేక్​ బచ్చన్​? 2024 ఎన్నికల్లో ఆ స్థానం నుంచే పోటీ?

Abhishek Bachchan Enters In Politics: బాలీవుడ్​ స్టార్​ హీరో అభిషేక్​ బచ్చన్​ త్వరలో పాలిటిక్స్ లోకి రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఆయన తండ్రి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పోటీ చేసి గెలిచిన స్థానం నుంచి బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. సమాజ్ వాదీ పార్టీ తరపున ప్రయోగ్ రాజ్ లోక్ సభ పార్లమెంట్ స్థానం నుంచి అభిషేక్ పోటీచేయనున్నట్లు సమాచారం. ప్రధాని రాజీవ్ గాంధీ కోరిక మేరకు 1984లో అమితాబ్ ప్రయోగ్ రాజ్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి భారీ మెజార్టీతో లోక్ దళ్ నాయకుడు హేమ్ వతి బహుగుణపై భారీ మెజార్టీతో గెలుపొందారు. మరోవైపు అభిషేక్ తల్లి జయాబచ్చన్ కూడా ఎస్పీ తరపున యూపీ నుంచి రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు.  

తాాజాగా అభిషేక్ కుడా వారి తల్లిదండ్రుల అడుగుజాడల్లోనే నడవాలనుకుంటున్నాడు. అభిషేక్ బచ్చన్ త్వరలో అఖిలేష్ యాదవ్ యొక్క సమాజ్ వాదీ పార్టీలో చేరబోతున్నారని సమాచారం. 2024లో జరిగే ఎన్నికల్లో ప్రయాగ్‌రాజ్ నుంచి అభిషేక్ ను పోటీ చేయించాలని సమాజ్ వాదీ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. అయితే దీనిపై ఎవరూ అధికారికంగా స్పందించలేదు. అభిషేక్ బచ్చన్ రాజకీయాల్లోకి వస్తాడనే ప్రచారం చాలా కాలంగా సాగుతోంది. 

అయితే ఇప్పటి వరకు సినిమాల్లో రాణించిన అభిషేక్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా సత్తా చూపాలని ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా అభిషేక్ బచ్చన్, యామీ గౌతమ్ జంటగా నటించిన దాస్వి చిత్రం ఓటీటీ రిలీజైంది. ఇందులో అభిషేక్ బచ్చన్ నటనకు ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ చేతిలో బ్రీత్, ధూమ్ 4, హౌస్‌ఫుల్ 5, దాస్విన్ చిత్రాలు ఉన్నాయి. తన నటనతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న అభిషేక్.. పాలిటిక్స్ లో ఏ మేరకు రాణిస్తుడో వేచి చూడాలి. 

Also Read: Nithya Menen: నిత్యా మీనన్ ఇంట తీవ్ర విషాదం.. శకం ముగిసిందంటూ ఎమోషనల్ పోస్ట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News