Amitabh Bachchan: బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్‌కు మరోసారి కరోనా పాజిటివ్

Amitabh Bachchan: దేశంలో కరోనా మహమ్మారి నెమ్మదిగా వ్యాపిస్తోంది. సెలెబ్రిటీలు , రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ మరోసారి కరోనా బారినపడ్డారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 24, 2022, 10:49 AM IST
Amitabh Bachchan: బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్‌కు మరోసారి కరోనా పాజిటివ్

Amitabh Bachchan: దేశంలో కరోనా మహమ్మారి నెమ్మదిగా వ్యాపిస్తోంది. సెలెబ్రిటీలు , రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ మరోసారి కరోనా బారినపడ్డారు.

కరోనా మహమ్మారి దేశంలో మరోసారి పాగా వేస్తోంది. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఢిల్లీ, ముంబై నగరాల్లో రోజువారీ కేసులు 2-3 వందలుంటున్నాయి. ముఖ్యంగా సెలెబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. తాజాగా బిగ్‌బి అమితాబ్ బచ్చన్ మరోసారి కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమితాబ్ బచ్చన్..స్వయంగా ట్వీట్ చేశారు. 

ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని..తనను కలిసినవారంతా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అటు అభిమానులు కూడా అమితాబ్ ఆరోగ్యంపై ఆందోళన చెందుతూ ప్రార్ధనలు చేస్తున్నారు. బిగ్‌బి అమితాబ్ కరోనా బారిన పడటం ఇది రెండవసారి. 2020లో తొలిసారి కరోనా సోకి..ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆ సమయంలో అమితాబ్‌తో పాటు కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యా రాయ్, మనవరాలు ఆరాధ్య బచ్చన్ అందరూ కరోనా మహమ్మారి బారినపడ్డవారే. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ..కౌన్ బనేగా క్రోర్‌పతి కొత్త సీజన్ షూటింగ్‌లో ఉన్నారు. అలియా భట్, రణ్‌బీర్ కపూర్‌తో కలిసి నటించిన బ్రహ్మాస్త్ర త్వరలో విడుదల కానుంది. 

Also read: Varalaxmi Sarathkumar Pics: వరలక్ష్మి శరత్‌కుమార్ హాట్ ట్రీట్.. అంతా కనబడేలా! గతంలో ఇలా ఎప్పుడూ చూసుండరు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News