Archana Gautam on TTD Staff: తిరుమల కొండపై సినీ నటి రచ్చ! ఏడుస్తూ వీడియోలు రిలీజ్

Bollywood Actress Archana Gautam serious Allegations on TTD Staff: తిరుమల వెంకన్న దర్శనం చేసుకునేందుకు వచ్చిన తనతో అక్కడి సిబ్బంది దురుసుగా, అసభ్యంగా ప్రవర్తించారు అంటూ బాలీవుడ్ నటి అర్చనా గౌతమ్ ఆరోపించారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 5, 2022, 04:44 PM IST
Archana Gautam on TTD Staff: తిరుమల కొండపై సినీ నటి రచ్చ! ఏడుస్తూ వీడియోలు రిలీజ్

Bollywood Actress Archana Gautam serious Allegations on TTD Staff: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీ అనేకసార్లు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తిరుమల వెంకన్న దర్శనం చేసుకునేందుకు వచ్చిన తనతో అక్కడి సిబ్బంది దురుసుగా, అసభ్యంగా ప్రవర్తించారు అంటూ బాలీవుడ్ నటి, ఉత్తర ప్రదేశ్ కి చెందిన కాంగ్రెస్ నేత అర్చన గౌతమ్ ఆరోపించారు.. వీఐపీ దర్శనానికి తాను డబ్బులు చెల్లించినప్పటికీ దానికి తగిన రిసిప్ట్ ఇవ్వలేదని దర్శనం టోకెన్ ఇవ్వలేదంటూ ఆమె ఆరోపణలు చేస్తూ ఒక సెల్ఫీ వీడియో తీసి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ అంశం నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించిన ఆమె తన స్వస్తలమైన ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక తాజాగా సెల్ఫీ వీడియో విడుదల చేసిన అర్చన గౌతం ఈవో కార్యాలయంలో సిబ్బంది తనని కొట్టే ప్రయత్నం చేశారని తప్పుగా ప్రవర్తించారని ఆరోపించడమే కాక అలా ప్రవర్తించిన వారిని దేవుడు శిక్షిస్తాడని చెబుతూ కన్నీటి పర్యంతం అయింది. అంతేకాక భారతదేశంలోని హిందూ ధర్మిక స్థలాలు దోపిడీకి అడ్డాగా మారిపోయాయని ఆరోపించిన ఆమె ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కోరింది. అంతేకాక తనతో తప్పుగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.

ఇక ఈవో కార్యాలయంలో ఆ సెల్ఫీ వీడియో తీసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం కూడా వీడియోలో రికార్డు అయింది. అయితే ఈ ఘటన గురించి టీటీడీ మాత్రం మరోలా చెబుతోంది. వినాయక చవితి రోజు జరిగిన ఒక గొడవని ఆమె ఈరోజు తెరమీదకి తీసుకువచ్చారని, ఆమె ఒక ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖ తీసుకువచ్చారని అయితే ఆ లెటర్ సమయం అయిపోవడంతో బ్రేక్ దర్శనం కల్పించలేదని చెబుతున్నారు.

ఎలా అయినా తనకు దర్శనం కల్పించాల్సిందే అంటూ ఆమె గొడవకు దిగారని, రూల్స్ ప్రకారం అలా చేయలేమని చెప్పడంతో ఇప్పుడు ఇలా తమ మీద అభాండాలు వేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్ లోని హస్తినాపూర్ స్థానం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన అర్చన అనంత్ అక్కడి నుంచి ఓడిపోయారు. ఇక సమయం గడిచిపోవడంతో ఆమెకు సిఫారసు మేరకు టికెట్లు ఇవ్వకుండా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కేటాయించారని, అయితే లేఖ ఉన్నా ఆ టికెట్లు ఎందుకు ఇస్తారు అంటూ ఆమె గొడవకు దిగారు అని తెలుస్తోంది.

Also Read: Aravind Swamy in NBK 108: బాలకృష్ణ సినిమాలో అరవింద్ స్వామి.. షాకింగ్ పాత్రలో?

Also Read: Bigg Boss Telugu 6: బిగ్‌బాస్‌ 6లో రెండు జంటలు… మళ్లీ రెచ్చిపోయి దారుణ కామెంట్స్ చేసిన నారాయణ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News