Tiger 3 OTT Release: ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైన సల్మాన్-కత్రినా కైఫ్ టైగర్ 3, ఎందులో, ఎప్పుడు

Tiger 3 OTT Release: బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 బాక్సాఫీసులో రికార్డు కలెక్షన్లు చేస్తోంది. సల్మాన్‌కు మరో సూపర్ హిట్ అందించిన ఈ సినిమా త్వరలో ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 5, 2023, 08:15 AM IST
Tiger 3 OTT Release: ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైన సల్మాన్-కత్రినా కైఫ్ టైగర్ 3, ఎందులో, ఎప్పుడు

Tiger 3 OTT Release: బాలీవుడ్ దిగ్గజ నటుడు సల్మాన్ ఖాన్ టైగర్ సిరీస్‌లో మూడవది టైగర్ 3 కూడా సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు జరుపుతోంది. నవంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇక ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమౌతోంది. 

బాలీవుడ్ బాక్సాఫీసులో ఇప్పుడు కలెక్షన్ చర్చ నడుస్తోంది. షారుక్ ఖాన్‌కు వరుసగా పఠాన్, జవాన్ సినిమాలు భారీ హిట్లు అందించాయి. రెండు సినిమాలు ఈ ఏడాదిలో 1000 కోట్లు దాటి కలెక్షన్లు చేశాయి. ఇక ఇప్పుడు సల్మాన్ ఖాన్ వంతు వచ్చింది. సల్మాన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా టైగర్ 3 నవంబర్ 12న విడుదలైంది. ఈ సినిమాల చాలా అంచనాలు పెట్టుకున్నారు. రెండో రోజే ఇండియాలో వంద కోట్లు వసూలు చేసేసింది. ఆ తరువాత క్రమంగా కలెక్షన్లూ తగ్గుతూ వస్తుండటంతో కాస్త నిరాశే ఎదురైంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రలో, కత్రినా కైఫ్ ఫీమేల్ లీడ్ రోల్‌లో నటించారు. 

టైగర్ 3 ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 450 కోట్లు వసూలు చేసిది. మనీష్ శర్మ తెరకెక్కించిన ఈ సినిమా టైగర్ సిరీస్‌లో మూడవది. ఇందులో షారుక్ ఖాన్, హృతిక్ రోషన్‌లు గెస్ట్ రోల్స్‌లో కన్పించారు యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మించింది. వాస్తవానికి ఈ సినిమా 600 కోట్లు దాటి వసూళ్లు చేస్తుందని ఆశించారు. కానీ ఇప్పటి వరకూ 450 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం కలెక్షన్లు తగ్గిపోయాయి. 

ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లో డిసెంబర్ 12న స్ట్రీమింగ్‌కు సిద్ధమౌతోంది. సాధారణంగా దాదాపు అన్ని సినిమాలు థియేటర్ రిలీజ్ అయిన నెలరోజులకు ఓటీటీ రీలీజ్ అవుతుంటాయి. అందులో భాగంగానే ఇప్పుడు నెలరోజుల తరువాత డిసెంబర్ 12న ఓటీటీ ప్రైమ్‌లో విడుదల కానుంది. 

Also read: Rashmi Gautam: వైట్ అండ్ బ్లాక్ లో వయ్యారాలు పోయిన రష్మీ గౌతమ్.. పిక్స్ వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News